స్వామి వివేకానంద జయంతి , జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో నిర్వహించిన ఫైవ్ కే రన్‌లో తుడా చైర్మన్ ,తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ ,తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి(Dollars Divakar Reddy) ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక యువత, క్రీడాకారులు మరియు విద్యార్థులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
Read Also: Ponguru Narayana: సిటీలో 50 వేల మొక్కలు నాటడమే మా లక్ష్యం
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ
“లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి” అన్న వివేకానందుడి నినాదం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. యువత తమ శారీరక దృఢత్వం తో పాటు మానసిక వికాసం పై దృష్టి(Dollars Divakar Reddy) సారించాలని కోరారు. ఫైవ్ కే రన్ వంటి కార్యక్రమాలు కేవలం పరుగు కోసం మాత్రమే కాకుండా, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తిరుపతిని ఒక ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర కీలకమని అన్నారు.
వివేకానందుడి ఆశయాలకు అనుగుణంగా యువతకు మెరుగైన భవిష్యత్తును అందించడమే తమ లక్ష్యమని డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలిచిన యువతీయువకులకు డాలర్స్ దివాకర్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి భాజపా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్,బీజేపీ నాయకుడు పృథ్వి,ప్రజా ప్రతినిధులు మరియు యువతీ యువకులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: