📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Telugu News: Dog bite-అయ్యో పాపం.. రేబిస్ సోకి నాలుగేళ్ల బాలుడు మృతి

Author Icon By Pooja
Updated: September 16, 2025 • 1:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వీధి కుక్కలు ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు. అయినా వాటి నియంత్రణపై ఉదాసీనత చూపిస్తున్నాం. కొన్నిరోజుల కిందటే సుప్రీంకోర్టు(Supreme Court) వీధికుక్కలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వానికి కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను కూడా కోర్టు ఆదేశించింది. కుక్క కాటు ప్రమాదకరం. రోడ్లపై మూకుమ్మడిగా దాడి చేస్తే పెద్దవారైనా తప్పించుకోవడం కష్టమే. అలాంటి ఓ బాలుడికి కుక్క కరవడంతో అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి.

రేబిస్తో బాలుడు మృతి

గుంటూరు జిల్లా(Guntur) పొన్నూరు మండలంలోని వెల్లలూరు గ్రామానికి చెందిన తాడిశెట్టి రాజా, జ్యోతి దంపతులకు కార్తీక్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. 15 రోజుల క్రితం కార్తీక్ ఇంటిబయట ఉండగా బాలుడి తల, చేతులపై వీధి కుక్క దాడి చేసింది. తల్లిదండ్రులు వెంటనే పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడి ఆరోగ్యంలో మార్పులు రావడంతో విజయ వాడలోని ప్రైవేట్ వైద్యశాలకు(Private Hospital) తరలించారు. బాలుడికి రేబిస్ సోకినట్లుగా వైద్యులు గుర్తించి, చికిత్స అందించసాగారు. కానీ ఇంతలో బాలుడి పరిస్థితి విషమించి, మరణించాడు. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుడిని వీధి కుక్క బలితీసుకుందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీధి కుక్కలను నియంత్రించాలని లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టసంఘటనలు చోటు చేసుకుంటాయని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

బాలుడు ఎలా మృతి చెందాడు?
కుక్క కాటు కారణంగా రేబిస్ సోకడంతో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

కుటుంబ సభ్యులు ఎందుకు సమయానికి చికిత్స చేయించలేదు?
కుక్క కాటు జరిగిన తర్వాత పెద్దగా పట్టించుకోకపోవడంతో టీకాలు వేయలేదు, దాంతో పరిస్థితి విషమించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/youths-trapped-in-penna-river-in-nellore-pekata/national/548177/

anti rabies vaccine child dies dog bite Google News in Telugu Health Precautions Latest News in Telugu rabies death Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.