📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest Telugu News : The nature : ప్రకృతితో చెలగాటాలొద్దు

Author Icon By Sudha
Updated: December 17, 2025 • 4:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మానవ తప్పిదాల వల్లనే విపత్తులు ఒకదాని వెంట ఒకటి తోసుకువస్తున్నాయి. అపార ప్రాణా, ఆస్తి నష్టాలకు కారణమవుతున్నాయి. వాతావరణంలో తలెత్తుతున్న అనేక మార్పులు ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తు న్నాయి. ఇందుకు ముం దుగా నిందించాల్సింది, తప్పుపట్టాల్సింది మానవుడినే. మానవుని పర్యావరణ విధ్వంస చర్యలే ఈ బీభత్సానికి, విపత్తులకు కారణమవుతున్నాయని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే మానవుడి మనుగడే భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారు తుందని ఎందరో పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రేమికులు దశాబ్దాల తరబడి పదేపదే చెబుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే నాధుడే లేకుండాపోతున్నాడు. పర్యావరణాన్ని కాపాడడం అటుంచి దానికి తూట్లు పొడ వడం దురదృష్టకరం. ఫలితంగా మానవాళిపై ప్రకృతి (The nature) చేస్తున్న విలయ తాండవంతో అతలాకుతలం అవుతున్నారు. సముద్రాలు పొంగి దేశాలకు దేశాలే కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా తువాలా దేశం కనుమరగయ్యే ప్రమాదంలోకి చేరుకోవడంతో ఆ దేశ వాసులకు ఆస్ట్రేలియా ఆశ్రయం కల్పించేందుకు అంగీకరించింది. దశలవారీగా వారిని తమ దేశంలోకి అనుమ తించి అన్ని వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ట్లు ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా మూడువేల మంది తువాలా దేశస్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే దశల వారీగా వారిని అనుమతిస్తా మని ప్రస్తుతం మొదటి విడతగా 280 మందిని మాత్రమే అనుమతికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. సముద్ర తీరంలో ఉన్న అనేక దేశాల పరిస్థితి రానురాను ఆందోళనకరంగా తయారవుతున్నది. పర్యావరణాన్ని మాన వుడు ఎంతటి విఘాతం కల్పిస్తున్నాడో అంతకు రెట్టింపు స్థాయిలో ప్రకృతి (The nature)విరుచుకుపడుతున్నది. అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు కూడా పర్యావరణానికి చేటుతెస్తున్నాయి. ఇష్టానుసారంగా ఇసుక తవ్వ కాల నుంచి మొదలుపెడితే కొండలను తొలచి,పాజెక్టులు, రహదారుల నిర్మాణం, నగరీకరణ పేరుతో ప్రపంచవ్యా ప్తంగా కోట్లాది ఎకరాల పంట పొలాలను జనావాసాలుగా మార్చడం ఒక్కటేమిటి ఎన్ని విధాలుగా పర్యావరణానికి నష్టం చేయగలుగుతారో అన్నిమార్గాల్లో నిత్యం అన్వేషణ, విధ్వంసం కొనసాగుతూనే ఉన్నది. ఐక్యరాజ్యసమితి నివే దిక ప్రకారం మరో ఏడెనిమిదేళ్లలో ఇండియా జనాభా 150 కోట్లకుపైగా చేరుకుంటుందని అందుకు తగినట్టుగా సహజవనరులపై ఒత్తిడి పెరుగుతుందని ముఖ్యంగా అటవీ సంపద హరించుకుపోతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే భారతదేశంలో దాదాపు ప్రతిరోజూ మూడువందల ముప్పై ఎకరాలకుపైగా అటవీ భూమి అదృశ్యమైపోతున్నదని ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడించింది. బొగ్గు గనులు, ధర్మల్ విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు, నదీలోయలో ప్రాజె క్టుల కోసం యధేచ్ఛగా అడవులను నరికివేస్తున్నారు. ఇలాంటి కారణాలు ఎన్నో పర్యావరణానికి విఘాతం కల్పి స్తున్నాయి. ఇక ప్లాస్టిక్ సంచి మట్టిలో కలిసిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. కొన్ని ప్లాస్టిక్ వస్తువులను నిషేధించినా అవి కాగితాలకే పరిమితమైపో తున్నది. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి ఎంతటినష్టం చేకూరుస్తున్నదో ప్రజల్లో అవగాహన కల్పించడంలో అధికార వర్గాలు విఫలమవుతున్నాయని చెప్పొచ్చు. ఇక పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల వాడకం గురించి చెప్పక్కర్లేదు. పరిశ్రమలు వదులుతున్న పొగ, ధూళికణాలు, తదితరవన్నీ కలిసి వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. తాజాగా ఢిల్లీలో వాయుకాలుష్యం తారస్థాయికి చేరుకున్నది. ఎన్నో పరిమితులు విధించారు. డీజిల్ వాహనాలు తిరగకుండా నిషేధం విధించారు. మరొకపక్క పాఠశాలలకు సెలవులు ప్రకటించి వర్క్ ఫ్రమ్ హోమ్ నడుపుతున్నారు. ఇదే పరి స్థితి కొనసాగితే ఉష్ణోగ్రత పెరిగి ప్రపంచంలోని తీర ప్రాం తాలు, దీవులతోసహా అనేక దేశాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఏనాడో పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చ రించారు. మరొకపక్క పర్యా వరణ సమతుల్యం దెబ్బతిన్న కారణంగా వర్షాలు కురవక పోవడం, కురిస్తే ఒకే ప్రాం తంలో కుంభవృష్టి కురవడం ఇటీవల కాలంలో పెరిగిపో యింది. అంతేకాదు వరదలు, తుఫాన్లు, భూకంపాలు లాంటివి ఉపద్రవాలు చోటు చేసుకుంటున్నాయి. యేటా 380కిపైగా ప్రపంచవ్యాప్తంగా ఉపద్రవాలు సంభవిస్తున్నట్లు అధికార రికార్డులే వెల్ల డిస్తున్నాయి. లక్షలాది మంది ఈఉపద్రవాలతో ప్రాణాలు పోగొట్టుకుంటుంటే కోట్ల సంఖ్య లో రోగపీడితులు అవుతున్నారు. పాకిస్థాన్, ఇరాన్, హైతి, న్యూజిలాండ్ నేపాలు, జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో గత నాలుగైదేళ్లుగా వస్తున్న భూకంపాలు ప్రళయాలనే సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. మొన్న ఆ మధ్య సిరియాలో భూకంపం కారణంగా దాదాపు తొమ్మిదివేల మందికిపైగా అసువులు బాసారు. మొరాకలో వచ్చిన ప్రకంపనాలతో దాదాపు నాలుగువేల మంది జీవితాలు సజీవ సమాధి అయిపోయాయి. పశ్చిమ పాకిస్థాన్లో తరుచుగా వస్తున్న భూకం పాలకు అక్కడిప్రజలు వణికిపోతున్నారు. భారత దేశానికి సంబంధించి కూడా అనేక ప్రాంతాల్లో భూప్ర కంపనాలు కన్పిస్తూనే ఉన్నాయి. పాలకులు తీసుకుంటు న్న ముందు జాగ్రత్తల వల్ల ఉపద్రవాలకు సంబంధించి ప్రాణ, ఆస్తుల నష్టం కొంతవరకు నియంత్రించగలుగుతు న్నారు. కానీ పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్న కారణం గా ఏర్పడుతున్న ప్రకృతి విజృంభణకు అడ్డుకట్టవేయలేక పోతున్నారు. ఏదిఏమైనా
ఈ ఉపద్రవాలనియంత్రణకుపర్యా వరణాన్ని కాపాడేందుకు త్రికరణశుద్ధిగా కృషి చేయాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Climate Change ecological balance Environmental Protection latest news nature respect nature Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.