నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను (Ditva Cyclone) శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను (Ditva Cyclone) దెబ్బకు ద్వీపదేశం అతలాకుతలం అవుతోంది. కొండచరియలు విరిగిపడ్డాయి. రవాణా వ్యవస్థ కూడా దెబ్బతింది. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. వరద ధాటికి 600కి పైగా ఇళ్ళు, స్కూళ్ళు దెబ్బతిన్నాయి. చాలా వంతెనలు కొట్టుకోపోయాయి. రహదారులు, పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి.
Read Also: KGH Hospital:కేజీహెచ్‌లో అగ్ని ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న రోగులు
ఇబ్బందులు పడుతున్నారు
ఈ క్రమంలో కువైట్ నుంచి ఇండియాకు వస్తున్న నెల్లూరు(D)కు చెందిన ఏడుగురు ప్రయాణికులు శ్రీలంకలోని కొలంబో ఎయిర్ పోర్టులో చిక్కుకున్నారు. చెన్నై (Chennai) కి రావాల్సిన విమానం రద్దవడంతో రెండు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని వెంటనే ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: