AP Census 2027: ఏపీలో 2027 డిజిటల్ జనగణన ప్రారంభం

Follow Us: Google News Daily Hunt
AP Census 2027: ఏపీలో 2027 డిజిటల్ జనగణన ప్రారంభం
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ జనగణన కార్యకలాపాల సంచాలకులు జె.నివాస్

AP Census 2027: ప్రపంచంలోనే అతిపెద్ద గణాంక కార్యక్రమమైన జనగణన 2027 ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ రంగం సిద్ధమైందని ఈనెల 16 నుంచి మొదటి దశగా ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన రాష్ట్రంలో ప్రారంభం కానుందని ఆంధ్రప్రదేశ్ జనగణన కార్యకలాపాల సంచాలకులు జె.నివాస్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద పరిపాలనా కార్యక్రమంగా నిలిచే ఈ జనగణన, ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించడంతో పాటు స్వీయ-గణన సదుపాయం కల్పించడం ద్వారా ప్రత్యేకతను సంతరించుకుందని ఆయన తెలిపారు..

Read also: Sathya Sai District Blast Incident: కదిరి పేలుడు ఘటన.. డిటోనేటర్లే కారణం

Digital India census 2027 process

Digital India census 2027 process

AP Census 2027: డిజిటల్ విధానం ప్రత్యేకత

బుధవారం రాష్ట్ర సచివాలయంలోని ప్రచార విభాగంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విజయవాడ పిఐబి సంచాలకులు జి. సురేష్కుమార్ కలసి ఆయన మాట్లాడుతూ భారతదేశంలో జనగణన ఒక రాజ్యాంగబద్ధమైన కార్యక్రమమని ఇది రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో 69వ అంశంగా పేర్కొనబడిందన్నారు.

1948జనగణన చట్టం మరియు 1990నియమాల ప్రకారం ఇది నిర్వహించబడుతుందన్నారు. సేకరించిన వ్యక్తిగత సమాచారం సెక్షన్ 15ప్రకారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందన్నారు. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో ఈ ప్రక్రియ అమలు చేయబడుతుందన్నారు. 2011లో చివరి జనగణన నిర్వహించగా, 2027లో జరగబోయేది 16వది కాగా, స్వాతంత్య్రం తర్వాత 8వదని ఆయన తెలిపారు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు