ఆర్థిక నేరాల జాబితాలో కొత్తగా చేరిన డిజిటల్ అరెస్టులు, కోట్లు కొల్లగొట్టడాలు వంటి మోసపూరిత వ్యవహారాలు విరివిగా జరగడంతో ఈ దేశానికి పెద్ద చిక్కొచ్చిపడింది. దేశం మొత్తం మీద రోజుకొక్కటైనా బయటపడుతోంది. ఈ ఏడాది సమాజానికి అతి పెద్ద సవాలు ఏదైనా ఉందంటే అది డిజిటల్అరెస్టులే. జరిగిన సంఘటనలను విశ్లేషించుకుం టే బాధితులు ఎక్కువ మంది వృద్ధులే. దేశంలోనే ఇంతవరకు రూ.3 వేల కోట్లు మోసగాళ్ల ఖాతాల్లోకి చేరిపోయింది. వయోవృద్ధుల కష్టార్జితాన్ని, సంపదను, మోసగాళ్లు తేలికగా కొల్లగొట్టగలిగారంటే, దానికి పెట్టు బడి కేవలం జనంలో ఉండే భయమే. అరెస్ట్ అనే పదం వింటేనే భయపడతాం. ఇదెక్కడి గొడవరా బాబూ! అని నిట్టూర్పు విడుస్తాం. అలాంటిది కనీసం పోలీసుస్టేషన్కి వెళ్లకుండానే ఫోన్లోనే డిజిటల్ అరెస్ట్ (‘Digital’ Arrest)అయ్యారు. అంటే ఇంక పైప్రాణాలు పైకే. ఈ బలహీనతను ఆసరాగా తీసు కుని డిజిటల్ అరెస్టులను కొత్త పదం సృష్టించారు. ఇది ఏ సాంకేతిక పద కోశంలోనూ కనపడని మాట. కనీసం పోలీసులకు పరిచయం లేని మాట. కానీ ఈ పదాన్ని సృష్టించి విశ్వామిత్రుడిని తలదన్నేలా విశ్వవ్యాప్తి చేయ గలగటం విస్మయపరిచే విషయం. ఇది విస్తృత పరిధి గల అంశంగా సుప్రీంకోర్టు భావిస్తోంది. జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభు త్వం సమర్పించిన రహస్య నివేదికను పరిశీలిస్తోంది. ధర్మాసనం ముందుకు డిజిటల్ అరెస్టుల (‘Digital’ Arrest)సమస్య ప్రస్తా వనలోకి రావడంతో రానున్న రోజుల్లో ఈ అంశంపై గట్టి పరిష్కారం లభించే అవకాశం ఉంది. దీనిని అతి పెద్ద సవాలుగా స్వీకరిస్తోంది. న్యాయవ్యవస్థ కఠినమైన ఆదే శాలను జారీ చేసే విషయమై ఆలోచిస్తోంది. నేరగాళ్లను గుర్తించడంలో ఎలాంటి ఆటంకాలున్నా, చట్ట పరిధిలో నుంచి మినహాయింపు నిచ్చే విధంగా నిర్ణయిస్తుందని ఎదురు చూస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్ మొదట్లో తాము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని న్యాయ వ్యవస్థ పరిధిలోనే పరిష్కారాలు, మార్గదర్శకాలు లభిస్తా యని పోలీసు వ్యవస్థ నమ్ముతోంది. మునుపటి విచార ణలో, సుప్రీంకోర్టు మోఖికంగా సెంట్రల్బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు బాధ్యతను చేపట్టాలని ప్రతిపాదిం చింది. నకిలీ పత్రాలను ఉపయోగిస్తూ న్యాయమూర్తులు, పోలీసు అధికారులుగా నటిస్తూ మోసగాళ్ల మోసానికి డిజిటల్ పరికరాలే పరోక్షంగా సహకరిస్తున్నాయి. సైబర్ నేరాలు సరిహద్దుల అవతల నుండి ఉద్భవించాయని, “మనీ లాండరింగ్ ముఠాల” ద్వారా రూపొందించబడ్డా యని అటార్నీ జనరల్ వెంకటరమణి తన అభిప్రాయాన్ని కోర్టుకు నివేదించారు. డిజిటల్ అరెస్టులవెనుక ఉన్న ఆర్గనైజేషన్ సైబర్ నేరాలు ‘స్కామ్ కాంపౌండ్స్’ నుండి ఉత్పన్నమవుతున్నాయి అనే అభిప్రాయపడ్డారు. హర్యానా లోని అంబాలాలో సీనియర్ సిటిజన్ జంట నుంచి రూ. 1.05 కోట్లు వసూలు చేయడానికి మోసగాళ్ళు డిజిటల్ అరెస్టు పేరిట దోచుకున్న కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. అయితే, దేశవ్యాప్తంగా అనేక నమో దవుతున్నాయని, అమాయక ప్రజలను, ముఖ్యంగా సీని యర్ సిటిజన్లను, నేరస్థులు ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్న విషయం న్యాయ స్థానం ముందుకు వచ్చింది. ‘ఆర్థిక కోణం మాత్రమే కాకుండా మానవీయ కోణం కూడా ప్రభావం చూపుతుం ది. మోసపూరిత వ్యక్తులకు విదేశాలలో ఉపాధి హామీగా ఈ దగా ఉపయోగపడుతుంది. నేరస్థులు న్యాయమూర్తుల ముఖాలను మార్ఫింగ్ చేస్తారు. కోర్టు గదులను నేపథ్యంగా చూపించి బాధితులకు కాల్చేస్తారు. డిజిటల్ ఆరెస్టుకేసుల్లో కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని సాక్షాత్తూ సుప్రీంకోర్టు త్రిసభ్యధర్మాసనం అభిప్రాయపడింది. విస్తృత స్థాయిలో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అత్యున్నత న్యాయస్థానం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమకు ఒక పరిశీలనా నివేదికనిచ్చి సూచనలు చేసేందుకు అమికస్ క్యూరీని ఏర్పాటు చేసింది. సైబర్ నేరాలలోనే ఇది అతి కిరాతకమైన నేరం. ఈ రకం నేరం చేసే మోసగాళ్లు బెదరింపులకు పాల్పడుతూ, ఆడియో, విడియో కాల్స్లో ప్రధా నంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని పీడిస్తున్నారు. బాధి తులను కాల్లోనే బందీలుగా చేసి, డబ్బులు చెల్లించేలా వత్తిడి తెస్తున్నారు. వారి బలహీనతలను ఆసరాగా చేసు కుని ఒక విధంగా చెప్పాలంటే మెస్మరైజ్ చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సిబిఐ సమర్పించిన రెండు నివేదికలను కోర్టు పరిశీలించింది. ఒకవేళ ఇలాంటి కేసుల్లో కఠినమైన ఆదేశాలు ఇవ్వకుంటే, ఈ సమస్య మరింత జటిలంగా మారుతుందని ధర్మాసనం పేర్కొన్నది. సైబర్ నేరాల కారణంగా ఎంతో మంది ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు. ఈ కేసుల తీవ్రతను అర్థం చేసుకోకపోతే ఇకపై మరింత మంది మోసగాళ్ల గాలంలో పడిపోతారు. థాయ్లాండ్, నైజీరియా వంటి దేశాల నుంచి ఇలాంటి నేరాలు తొంగి చూస్తున్నాయి. ఇదే విషయమై ఇంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొబేషనరీ ఐపిఎస్లను ఉద్దేశించి ప్రసం గించినప్పుడు డిజిటల్ అరెస్టు ముప్పు నుంచి ప్రజలను కాపాడాలంటే వారిని చైతన్యవంతుల్ని చేయడం ఒక్కటే తక్షణ కర్తవ్యంగా భావించాలని కోరారు. సైబర్ నేరగాళ్లు వీడియోకాల్స్ చేసి తాము పోలీసులమని తాము చెప్పి నట్లు చేయకుంటే డిజిటల్ అరెస్టు చేస్తామని భయపెడ తారు. కాగా అలాంటి సందర్భంలో ధైర్యం వహించి చాకచక్యంగా వ్యవహరించినప్పుడే ఇలాంటి ముప్పు నుంచి బయటపడతాం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :