DGP Harish Kumar Gupta: మహిళలపై జరుగుతున్న దాడులు, వారిపై అత్యాచారాలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఏపీ డీజీపీ (DGP) హరీష్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta) తెలిపారు. ఈ కేసుల్లో నిందితులపై నేరారోపణలకు తగిన సాక్ష్యాధారాలను పోలీసు నూతన సాంకేతిక విజ్ఞానాన్ని వినియయోగిస్తున్నామని తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో క్రైమ్ ఎగ్నేష్ విమెన్ కేసుల్లో దాదాపు అన్ని కేసుల్లో శిక్షలు పడుతున్నాయని తెలిపారను. మహిళపై అత్యాచారం కేసులో నిందితునికి జీవిత ఖైదు వేపర్లలో 33 ఏళ్ల మహిళపై అత్యాచారం (rape of woman) చేసిన కేసులో నిందితుడు తిప్పాబత్తిన క్రిష్ణయ్య అలియాస్ ఒబులయ్య (54)కి జీవిత ఖైదుతోపాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తూ కడవలోని అదనపు సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది.
అనారోగ్యంతో ఉన్న మహిళపై అత్యాచారం
2022 జనవరి 11న మైలవరం మండలం, వేపర్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలు ఇంట్లోకి నిందితుడు బలవంతంగా చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు అదే రోజున సాయంత్రం మైలవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాధితురాలు మహిళా మేజిస్ట్రేట్ ఎదుట (164 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం) ఇచ్చిన వాంగ్మూలం, స్థానికుల నుండి సేకరించిన వాంగ్మూలాలు, నిందితుడి సామర్థ్య పరీక్ష మరియు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికల ఆధారంగా పూర్తి సాక్ష్యాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదు శిక్షతోపాటు ఐపీసీ సెక్షన్ 376 కింద రూ.1,00,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో 3.6 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందిగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సెక్షన్ 448 కింద ఏడాది పాటు సాధారణ జైలు శిక్ష మరియు రూ.1,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మూడునెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సిందిగా న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది.
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన శిక్ష
అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యాస్మిన్ బాదితురాలి పక్షాన వాదనలు వినిపించి నేరస్తునికి శిక్ష పడే విధంగా కృషి చేసారు. కర్నూలు జిల్లాలో పోక్సో కేసులో (POCSO case) ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, రూ. 25 వేలు జరిమాన పడింది. మైనర్ బాలిక పట్ల అఘాయిత్యం కు పాల్పడిన ఘటనలో శిక్ష ఖరారు… కర్నూలు జిల్లా స్పెషల్ ఫోక్సో కోర్టు తీర్పు వెలువడిందని తెలిపారు. గుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థ బలోపేతంగా వినియోగించి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో కర్నూలు పోలీసులు ముద్దాయిలకు కఠిన శిక్షల కై గట్టి చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిందితుడు షేక్ చాంద్ బాషా (21), అమరావతి నగర్, ఆదోని పట్టణం, కర్నూలు జిల్లా కు చెందిన వాడు. కూలీ పని చేస్తూ జీవనం సాగించేవాడు నిందితుడు షేక్ చాంద్ భాషా ప్రేమ పేరుతో బాలిక పట్ల కర్నూలు జిల్లా మాయ మాటలు చెప్పి ఒక మైనర్ అఘాయిత్యం కు పాల్పడ్డాడు. పత్తికొండ పట్టణం కు చెందిన మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు 2021 ఫిబ్రవరి 7వ తేదీన పత్తికొండ యుపిస్ పోలీసు స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 64 / 2021 పోక్సో యాక్ట్ 2012 నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు చేపట్టారు. అప్పటి డోన్ డిఎస్పీ వై. శ్రీనివాస రెడ్డి దర్యాప్తు చేపట్టి సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించారు. అన్ని కోణాల్లో విచారించి, నేరం రుజువు కావడంతో కర్నూలు జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి ఇ. రాజేంద్రబాబు గారు నిందితుడు షేక్ చాంద్ భాషా కఠిన కారాగార శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు. జరిమానా కట్టని యెడల 6 నెలలు జైలు శిక్ష పొడగిస్తారని తెలిపారు.
Read also: Purandeshwari: రాజకీయాల్లో స్వలాభాపేక్ష చూసుకోలేదు : ఎంపి పురందేశ్వరి