📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Devotees : భక్తుల భద్రతే ధ్యేయంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు

Author Icon By Shravan
Updated: August 19, 2025 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల Devotees : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల వేంకటేశ్వరస్వామి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తుల (Devotees at Brahmotsavam) భద్రతే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందించి సమన్వయంతో వ్యవహరించాలని టిటిడి జె. శ్యామలరావు సూచిం చారు. బ్రహ్మోత్సవాలు జరిగే ఆ తొమ్మిదిరోజులు తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలు అంచనా వేసేందుకు సాంకేతిక సాయం తీసుకోవాలని నిర్ణయించారు. వీలైనంత వరకు బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులను తిరుమలకు ఆర్టీసి బస్సుల్లోనే ప్రయాణించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల భద్రత, రద్దీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సెప్టెంబర్ 24వతేదీ బుధవారం నుండి అక్టోబర్ 2వతేదీ గురువారం వరకు తిరుమలలో (Tirumala) నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భక్తుల రద్దీ నియంత్రణ, మాఢవీధుల్లో వాహనసేవల వీక్షణకు గ్యాలరీల్లో సౌకర్యాలు, అదనపు సిబ్బంది నియామకం తదితర అంశాలపై సోమవారం సాయంత్రం తిరుమల అన్నమయ్యభవనంలో టిటిడి అదనపు చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, టిటిడి జెఇఒ వీరబ్రహ్మం, టిటిడి సివిఎస్ కెవి మురళీకృష్ణ, ఎస్ఎఎసిఎఒ బాలాజీ, సిఇ సత్యనారాయణ, ఏపిఎస్ఆర్టీసి ఆర్ఎం జగదీశ్, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవితో కలసి ఇఒ శ్యామల రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు

వడ్డీకాసుల వేంకటే శ్వరస్వామికి ఈ ఏడాది సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తు న్నామన్నారు. సెప్టెంబర్ 24 నుండి మొదలుకానున్న సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల దర్శనాలకే అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఆలయంలోపల, గ్యాలరీల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వాహనాల పార్కింగ్కు అసౌకర్యం కలగకుండా జిల్లా పోలీసులతో సమన్వయంతో ఏర్పాట్లు, ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇఒ ఆదేశించారు. అలిపిరి వద్ద ద్విచక్రవాహనాలు, నాలుగుచక్రాల వాహనాలు రాకపోకలు అంచనాకు, పార్కిం ప్రాంతాలు, ఎక్కువగా వాహనాలు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తాము ఇఒ తెలిపారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా వుండేలా భక్తులను ఆకట్టుకునేలా శ్రీవారి ఆలయం, తిరుమలలోని ముఖ్యకూడళ్లను సర్వాంగసుందరంగా అలంకరిస్తామన్నారు.

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టిటిడి ఏర్పాట్లు

ఆలయ కైంకర్యాలు, వాహనసేవలు, ఇంజనీరింగ్ పనులు, గృహాలు, కల్యాణకట్ట, ఆన్నప్రసాదం, పారిశుధ్యం, ఉద్యానవా విభాగం ఆలంకరణలు, శ్రీవారిసేవకుల సేవలు, మే ఐ హెల్ప్ కేంద్రాలు, మీడియా, సామాజిక మాధ్యమాల ప్రచారం, సాంస తిక కార్యక్రమాలు, టిటిడి, ఏపిఎస్ ఆర్టీసి రవాణా సదుపాయాలు తదితర వాటిపై సమగ్రంగా చర్చించి ప్రణాళికలు రూపొందించాడా ఏడుకొండల వేంకటేశ్వరస్వామికి సెప్టెంబర్ 24వ నుండి జడి సాలకట్ల బ్రహ్మోత్స వాల్లో తొలిరోజు 24వతేదీ రాష్ట్ర ముఖ్యమం నారాచంద్రబాబునాయుడు పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాం సమర్పిస్తారని టిటిడి ఇఒ శ్యామలరావు తెలిపారు. అదేరో సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9గంటలకు పెద్దశేషవాహను ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఆశేషసంఖ్యలో విచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని, అన్ని విభాగా సమన్వయంతో సేవలందించాలని ఆదేశించారు అంగరంగవైబవంగా, విజయవంతంగా ఈ ఏడాది బ్రహ్మోత్సవా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/dont-let-problems-arise-in-the-distribution-of-fertilizers/andhra-pradesh/532407/

Breaking News in Telugu Devotees Safety Latest News in Telugu Pilgrims Safety Measures Telugu News Paper Tirumala Brahmotsavam 2025 Tirupati devotees TTD Arrangements

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.