📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Development : ఆర్థిక లోటు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు

Author Icon By Shravan
Updated: July 30, 2025 • 2:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కావలి (నెల్లూరు) : రాష్ట్రంలో రూ. 16 వేల కోట్లు ఆర్ధిక లోపు వున్న ప్పటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) రాష్ట్రంలోని ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెల్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళవారం ఆయన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణా రెడ్డి. ఎమ్మెల్సీ బీదా రవిచంద్రాతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు. తుమ్మలపెంట పంచాయితీలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనం తరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రా లను పంచి ప్రజల సమస్యలను అడిగి తెలు సుకున్నారు. తుమ్మలపెంట లోని పట్టపుపాళెం వద్ద రూ.42.6 లక్షల వ్యయంతో అంతర్గత సిసి రోడ్లకు, తుమ్మలపెంట పల్లిపాళెం వద్ద రూ.44 లక్షల వ్యయంతో జల జీవన్ మిషన్ కింద త్రాగునీటి వసతికి, రూ. 27.4 లక్షల వ్యయంతో సీసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఓట్లూరు వద్ద రూ.25 లక్షల వ్యయంతో సిసి రోడ్లు నిర్మాణం, రూ. 55 లక్షలతో వ్యయంతో రక్షిత మంచినీటి పథకం శంకుస్థాపనలు ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రలతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవింద్ర మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన పలు హామీలలో పలు హామీలలో 95 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే ఫించన్లను పెంచి అరియర్స్ పాటు ఒకే సారి ఫించన్దారులకు చెల్లించడం జరిగిందన్నారు. నేడు రాష్ట్రంలో 64 లక్షల మంది ఫించన్ దారులు వున్నారని, నెలకు రూ. 4వేలు ఫించన్ ఇచ్చే ఎకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వుందన్నారు.

తల్లికి వందనం కింద కుటుంబంలో చదువు కుంటున్న పిల్లలందరికి ఇంటర్మీడియట్ వరకు రూ.13 వేలు వంతున చెల్లించడం జరుగు తుందన్నారు. శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర మాట్లాడుతూ మత్సకారుల సమస్యలు తెలిసిన వ్యక్తి మంత్రి కొల్లు రవింద్రా అని కోనియాడారు. తమ ప్రభుత్వ హయంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు అత్యదిక నిధులతో సిసి రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అవసరం మేరకు అంగన్వాడీ కేంద్రాలు తీసుకురావడం జరిగిందన్నారు. గ్రామీణ సమస్యలు తెలుసుకునేందుకు మంత్రి తుమ్మలపెంటకు వచ్చారని ఆయన తెలిపారు. ప్రభుత్వం కాపుల అభ్యున్నతికి, మత్సకారుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని సమస్యలను తెలుసుకోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయా లేదా అని తెలుసుకోని పధకాలు అందని వారికి అవి అందే విధంగా చర్యలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం చెప్పట్టినట్లు తెలిపారు.

ఓట్టూరు అంటే తనకు ప్రత్యేక అభిమానం అని ఆయన అన్నారు. ఈ రోజు సీసీ రోడ్డుతో పాటు, మంచి నీటిని అందించే విదంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రానున్న రోజులలో డ్రైనేజిలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, స్మశాన వాటికకు వెల్లే రోడ్లను పూర్తిగా వేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి కావలి రూరల్ మండల అధ్యక్షులు అవుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ అలేఖ్య. బీదా గిరిధర్, వలగాటి శ్రీనివాసుల రెడ్డి, అప్కాబ్ మాజీ చైర్మన్ పాల్ శెట్టి, నూడా మాజీ డైరెక్టర్ పాలడగు రంగారావు, మాజీ జడ్పిటీసి సభ్యులు నాయుడు రాంప్రసాద్, టిడిపి నాయకులు, కార్యకర్తలు వున్నారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Tirumala : తక్కువ ధరలో తిరుపతిలో బ్రాండెడ్  హోటళ్లు

Andhra Pradesh Budget Breaking News in Telugu development Financial deficit Latest News in Telugu Telugu News Telugu News Today Welfare schemes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.