📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rain Alert : రైతులకు పిడుగులాంటి వార్త

Author Icon By Sudheer
Updated: October 23, 2026 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rain Alert : తెలుగు రాష్ట్రాల రైతులకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త అందించింది. నేడు బంగాళాఖాతంలో నూతనంగా అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో, ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో వర్ష ముప్పు ఎదురవ్వడంతో ఖరీఫ్ పంటలు దక్కుతాయో లేదోనని అన్నదాతల్లో తీవ్ర కలవరం మొదలైంది. మరో వారంలో వరి కోతలు ప్రారంభం కానున్న తరుణంలో, నవంబర్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. సరిగ్గా ఈ కీలక సమయంలో వర్షాలు కురిస్తే కోతకు వచ్చిన వరి పంట నేలకొరిగి, తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read Also : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రీషెడ్యూల్.. నవంబర్ 1న పోలింగ్AP

ఇతర పంటలపైనా వర్ష ప్రభావం – బియ్యం ధరలు పెరిగే ఆస్కారం

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వరితో పాటు మొక్కజొన్న, పెసర, మినుము, పత్తి పంటల కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ దశలో కురిసే వర్షాల వల్ల ధాన్యం తడిసిపోవడమే కాకుండా రంగు మారి మార్కెట్లో సరైన మద్దతు ధర లభించక రైతులు కోలుకోలేని దెబ్బ తింటారు. అంతేకాకుండా, వర్షాల వల్ల ఖరీఫ్ ధాన్యం దిగుబడి తగ్గితే మార్కెట్లో బియ్యం కొరత ఏర్పడి, రానున్న రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కావున రైతులు తమ కోతల ప్రక్రియలో జాగ్రత్తలు వహించాలని, ధాన్యం తడవకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

AP Rain Alert Bay of Bengal low pressure Google News in Telugu Heavy Rains Threat to Kharif Crops Latest News in Telugu Paddy Harvest Delay AP Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.