📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Devarapalli Crime News: నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి అమానుషం

Author Icon By Siva Prasad
Updated: February 21, 2026 • 11:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Devarapalli Crime News: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మానవత్వం మంటగలిసేలా ఓ 70 ఏళ్ల వృద్ధుడు కేవలం నాలుగేళ్ల పసిప్రాయం కలిగిన చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also: AI Summit : ఏఐ సమ్మిట్ పై జగన్ నకిలీ సానుభూతి – లోకేశ్

దేహశుద్ధి చేసిన స్థానికులు

నిందితుడి అమానుష చర్యను గమనించిన స్థానికులు వెంటనే అతడిని పట్టుకుని బంధించారు. ఆగ్రహంతో నిందితుడికి తీవ్రంగా దేహశుద్ధి చేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గోపాలపురం మండలం గోపవరానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పొగాకు బ్యారన్ క్యూరింగ్ పనుల నిమిత్తం ఇటీవల దేవరపల్లికి కూలీగా వచ్చినట్లు స్థానికులు వెల్లడించారు.

Devarapalli crime news: Old man’s brutality against a four-year-old child

Devarapalli Crime News: వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి బాలిక

నిందితుడి దాడిలో అస్వస్థతకు గురైన చిన్నారిని చికిత్స మరియు వైద్య పరీక్షల నిమిత్తం వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Crime Updates Devarapalli Crime News East Godavari Crime Elderly Man Arrested Devarapalli Minor Girl Assault Case POCSO Case East Godavari

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.