Pawan Kalyan Convoy: ఆంధ్రప్రదేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్‌లోని వాహనాలు అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని చివరి వాహనం దెబ్బతింది. ఈ ఘటనలో వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో వాహనంలో పవన్ కల్యాణ్ లేరు.
Read Also: TTD: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు
రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న పవన్ ను పికప్ చేసుకోవడానికి వెళుతుండగా కాన్వాయ్ ప్రమాదానికి గురయ్యింది.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం జరగబోయే అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఆయన విశాఖకు వచ్చినట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: