📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Pithapuram పిఠాపురం మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్..శ్రావణ శుక్రవారం కానుక

Author Icon By Anusha
Updated: August 22, 2025 • 3:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రావణ మాసం హిందువులకు ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ శ్రావణ మాసం (Shravana Masam) లో చివరి శుక్రవారం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతాలను మహిళలు అత్యంత భక్తి, శ్రద్ధలతో నిర్వహించారు.

ఆలయాల పరిసరాలు దీపాల కాంతులతో, పూలతో, భక్తుల సందడితో నిండిపోయాయి.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన నియోజకవర్గమైన పిఠాపురం ప్రజలతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని కొనసాగించారు.
శ్రావణ శుక్రవారం కానుకగా ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ చీరలు, పసుపు, కుంకుమ పంపిణీ చేయించారు.మహిళల పట్ల గౌరవం, సంప్రదాయాల పట్ల ఆరాధనను తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ కార్యక్రమం విస్తృత చర్చకు దారి తీసింది.
చివరి శ్రావణ శుక్రవారం సందర్బంగా పాదగయ క్షేత్రంలో కొలువైన ఉమా కుక్కుటేశ్వరస్వామి, పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నారు. ఈ పూజలో పాల్గొంటున్న మహిళలకు చీర, పసుపు కుంకుమ అందచేస్తున్నారు.
ఈ ఓజు ఉదయం 5 గంటల నుంచి ఈ వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభం అయ్యాయి. ఐదు విడతలుగా ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తారు. అయితే ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ వరలక్ష్మి వ్రత తొలి పూజల్లో పాల్గొన్నారు. 
పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజున 10 వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేస్తున్నారు.
సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఐదు విడుదలగా నిర్వహించారు. ఈ ఒక్కో బ్యాచ్ కు ఒక్కో పేరు పెట్టారు. అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని పేర్లు పెట్టారు.
ఒక విడతలో వెయ్యి నుంచి 15 వందల మంది మహిళా భక్తులు వరలక్ష్మీ వ్రతం చేసేలా ఏర్పాట్లు చేశారు.
అంబిక బ్యాచ్‌లోని మహిళలు శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు.
భ్రమరాంబ భక్త బృందం 6.30 గంటల నుంచి 8 గంటలు వరకు వ్రతంలో పాల్గొన్నారు.
చాముండి భక్త బృందం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు.. దుర్గ భక్త బృందం 9.30 నుంచి 11 గంటల వరకు పూజలు నిర్వహించారు. చివరగా ఈశ్వరి భక్త బృందం 11 నుంచి 12.30 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు.
AP Deputy CM Pawan Kalyan Breaking News latest news Pawan Kalyan news Sravana Masam 2025 sravana sukruvaram Telugu News varalakshmi vratam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.