📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Pawan Kalyan: ఉత్తరాంధ్ర వరద పరిస్థితిపై డిప్యూటీ సీఎం సమీక్ష

Author Icon By Aanusha
Updated: October 3, 2025 • 10:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరాంధ్ర జిల్లాలను కురుస్తున్న భారీ వర్షాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వరద నీరు గ్రామాలను, పట్టణాలను ముంచెత్తడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan) అధికారులను తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని, ముఖ్యంగా ప్రజలకు సురక్షితమైన మంచినీటి సరఫరా నిరంతరంగా కొనసాగాలని స్పష్టం చేశారు.

AP Students: ఇంటర్ విద్యార్థులపరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రక్షిత మంచినీటి సరఫరా (ఆర్.డబ్ల్యూ.ఎస్.) శాఖల ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రలో తుపాను ప్రభావంతో నెలకొన్న పరిస్థితులను అధికారులు ఆయనకు వివరించారు.

ఒడిశా నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో వంశధార, నాగావళి నదులు ఉప్పొంగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం (Srikakulam) లోని గొట్టా బ్యారేజీతో పాటు, వంశధార ప్రాజెక్టులోకి అంచనాలకు మించి వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ సమాచారం అందుకున్న పవన్, సహాయక చర్యలపై పలు కీలక సూచనలు చేశారు. “వరద ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

Pawan Kalyan

క్లోరిన్ కలిపిన సురక్షిత తాగునీటిని అందించాలని

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలి” అని ఆయన నిర్దేశించారు. వరద తగ్గిన తర్వాత పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైతే సమీప జిల్లాల నుంచి పారిశుద్ధ్య సిబ్బంది (Sanitation staff) ని తరలించి, పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులపై ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ప్రతి గ్రామంలో క్లోరిన్ కలిపిన సురక్షిత తాగునీటిని అందించాలని ఆదేశించారు. నీరు కలుషితం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే ముంపునకు గురయ్యే గ్రామాల్లోని ప్రజలను జిల్లా యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించిందని అధికారులు సమావేశంలో వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న చర్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు తన కార్యాలయానికి నివేదికలు పంపాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh Floods 2025 AP Heavy Rains Update Breaking News latest news Pawan Kalyan Deputy CM Pawan Kalyan Flood Relief Telugu News Uttarandhra Floods News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.