📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Delimitation : సీట్ల పెంపుతో సమస్యకు పరిష్కారం!

Author Icon By Sudha
Updated: April 7, 2026 • 4:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Delimitation : ఎట్టకేలకు నియోజకవర్గాల పునర్వి భజన(డీలిమిటేషన్) నిర్వహిస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో చట్టసభల స్థానాల సంఖ్యను జనాభాను బట్టి కాకుండా గంపగుత్త గా50శాతం పెంచుతామని ప్రకటిం చడంవల్ల నియోజకవర్గాల పునర్విభజ న (డీలిమిటేషన్) సంబం ధించిన సమస్యలు తొలగిపోతాయని భావిస్తున్నారు. గతంలో జరిగిన డీలి మిటేషన్లను గమనంలోకి తీసుకుంటే స్వాతంత్య్రం లభించిన తర్వాత 1951, 1961,1971లలో జనాభా లెక్కుల ఆధారంగా డీలిమిటేషన్ నిర్వహించారు. ప్రస్తుతం లోక్సభలో వున్న 543 నియోజకవర్గాల సీట్ల సంఖ్యను 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించారు. ఆనాటి దేశ జనాభా 54.8 కోట్లు మాత్రమే. నిజానికి 1981లో నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమం నిర్వ హించాల్సి వుంది. అయితే ఆనాడు దేశ జనాభా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ముందుగా దేశంలో నియంత్రణ కార్యక్రమాలు అమలు చేయాలన్న తలంపుతో డీలిమిటేషన్ కార్యక్రమాన్ని 2021 సంవత్సరంలో నిర్వహించే జనగణన తర్వాత చేయాలని ఆనాడు పార్లమెంటులో తీర్మానంచేశారు. డీలిమిటేషన్ ప్రక్రియను పార్లమెంటు చట్టం ద్వారా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పడే ‘డీలిమిటేషన్ కమిషన్’ నిర్వహిస్తుంది. సహజంగా జనాభా సంఖ్యనుబట్టి నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయిస్తారు. కాని ప్రస్తుతం పరి స్థితుల్లో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను నిర్ణయిం చే పక్షంలో కొన్ని రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకా శం వుంది.

Read Also : Rajnath Singh’s warning: పాకిస్తాన్ మరిన్ని ముక్కలుగా విడిపోయే ప్రమాదం..రాజనాథ్ సింగ్ వార్నింగ్

Delimitation

Delimitation : జనాభా లెక్కల సేకరణ

1971 జనాభా లెక్కల సేకరణ తర్వాత దేశ వ్యాప్తంగా విస్తృతంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాల ను అమలు చేశారు. అయితే ఆయా రాష్ట్రాల సామాజిక పరిస్థితులను బట్టి కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా అమలయ్యాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చాలా మందకొడిగా అమలయ్యాయి. ఇదే సమయంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల కుటుం బ నియంత్రణ కార్యక్రమాలు చాలా పగడ్భందిగా అమల య్యాయి. దాంతో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు సరిగా అమలు కాని రాష్ట్రాలలో జనాభా ఎక్కువగా వుంటే, నియంత్రణ కార్యక్రమాలు సక్రమంగా అమలయిన రాష్ట్రా లలో జనాభా తగ్గిపోయింది. ఈ స్థితిలో జనాభా ప్రాతి పదికన పునర్విభజన జరిగే పక్షంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాలలో లోక్సభ స్థానాలు విపరీతంగా పెరిగే అవకాశం వుండగా, కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని సవ్యంగా అమలు చేసిన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో లోక్సభ స్థానాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతాయి, అందు వల్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహ పలువురు ముఖ్యమంత్రులు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పున ర్విభజను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరగ నున్న జనాభా లెక్కల సేకరణ లెక్కల ప్రకారం కాకుండా 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా చేసుకొని ప్రస్తుతం వున్న లోక్సభ స్థానాలకు అదనంగా 50శాతం స్థానాలను పెంచే విధంగా ఏర్పాటు చేస్తున్నామని కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ఆయా ముఖ్యమంత్రు లకు కూడా అభ్యంతరం వుండదని భావిస్తున్నారు.

లోక్సభ స్థానాలు పెంచ డం అసాధ్యం

నిజానికి జనాభా ప్రాతిపదికన లోక్ సభ స్థానాలను పెంచడం కూడా ఆచరణ సాధ్యం కాదు. ముందుగా చెప్పుకొన్నట్టుగా 1971వ సంవత్సరంలో దేశ జనాభా 54.8 కోట్లు, ఆనాటి జనాభా ప్రకారం 543 స్థానాలు వుంటే, నేటి జనాభా దాదాపు 150 కోట్లకు కనీసం 1500స్థానాలకు పెరగాల్సి వుంటుంది. ఈ స్థానాలకు తోడు మూడోవంతు అంటే 500 మంది రాజ్యసభ సభ్యుల స్థానాలను కూడా కలపాల్సి వుంటుంది. ఇంతమంది సభ్యులకు పార్లమెంటు భవనంలో సీట్లు కేటా యించడం కూడా సాధ్యంకాదు. కొత్తగా నిర్మించిన పార్ల మెంటు భవనంలో లోక్సభ, రాజ్యసభలో మొత్తం 1272 సీట్లు మాత్రమేవున్నాయి. అంతేకాకుండా భారతదేశ జనాభా భవిష్యత్తులో అంటే మరో మూడు దశాబ్దాలపాటు పెరుగు తూనే వుంటుంది. భారతదేశ జనాభా సగటున 15 శాతం వంతున రాబోయే మూడు దశాబ్దాలలో దాదాపు 165-170 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు (మూడు దశాబ్దాల తర్వాత జనాభా తగ్గడం ప్రారంభం అవుతుంది). ఈ స్థితిలో ప్రతి పది సంవత్సరాలకు లోక్సభ స్థానాలు పెంచ డం అసాధ్యం. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో చట్టసభల సంఖ్య విషయంలో పరిమితి విధించారు. ఉదాహరణకి అమె రికా సంయుక్త రాష్ట్రాలలో 1913వ సంవత్సరానికి ముందు ప్రతి పదేళ్లకు జనాభా ప్రాతిపదికన కాంగ్రెస్(పార్లమెంటు)లో సీట్ల సంఖ్య పెంచినప్పటికీ 1913 నుండి ప్రతినిధులసభలో సీట్ల సంఖ్య 435కి పరిమితం చేశారు. అమెరికా జనాభా 1911లో 9.4కోట్లు వుండగా ప్రస్తుతం అంటే 2024 నాటికి దాదాపు నాలుగు రెట్లు పెరిగి 34కోట్లకు చేరుకుంది. అయి నా అమెరికా కాంగ్రెస్లో ప్రతినిధులసీట్లు 435గానే వుంది. అదే విధంగా భారతదేశంలో ఏదో ఒక దశలో చట్టసభల సభ్యుల సంఖ్య పెంపుదలను నిలుపుదల చేస్తే మంచిదనే భావన వ్యక్తం అవుతుంది.

Delimitation

సంఖ్యా బలానిదే పైచేయి

జనాభా ప్రాతిపదికన కాకుండా ఆయా చట్టసభల సంఖ్యను బట్టి గంపగుత్తగా 50 శాతం లోక్సభ స్థానాలను పెంచే పక్షంలో రాష్ట్రాల జనాభాతో నిమిత్తం లేకుండా అన్నిరాష్ట్రాల లోక్సభ స్థానాలు పెరుగు తాయి. ఉదాహరణకి 50 శాతం లోక్సభ స్థానాలు పెంచే పక్షంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ సీట్ల సంఖ్య 80 నుంచి 120కి, బీహార్ రాష్ట్రంలో 40 నుంచి 60 సీట్లకు పెరుగుతాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో వున్న 25 సీట్ల సంఖ్య 38 స్థానాలకు, తెలంగాణలో ప్రస్తుతం వున్న 17 స్థానాలు 23 లేదా 24కి, తమిళనాడులో 39 సీట్ల సంఖ్య 58లేదా 59 స్థానాలకి పెరుగుతాయి. వివిధ రాష్ట్రా లలో అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా 50 శాతం అదనంగా పెరుగుతాయి. ఉదాహరణకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వున్న 175 స్థానాల సంఖ్య 265 స్థానాలకు, తెలంగాణలో ప్రస్తు తం వున్న 119 స్థానాల సంఖ్య 179 లేదా 180స్థానాలకు పెరుగుతాయి. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుంది. ఇదిలావుండగా 106 రాజ్యంగ సవరణ ప్రకారం రానున్న లోక్సభ ఎన్ని కల నుంచి 33శాతం స్థానాలను మహిళలకు కేటాయిం చాల్సి వుంటుంది. అందువల్ల గంపగుత్తగా అదనంగా పెరగ నున్న స్థానాలు 33శాతం మహిళా సభ్యులకు సరిపోతాయి. అందువల్ల ఇప్పటికే రాజకీయాలలో కీలకంగా వున్న పురుష అభ్యర్థులకు వచ్చిన డోకా ఏమీ వుండదని చెప్పవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరగక ముందు దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్కు అత్యధికంగా 42 స్థానాలు వుండగా తమిళ నాడుకు 39, కర్ణాటకకు 28, కేరళకు 20స్థానాలు వుండేవి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా వున్నసమయంలో కేంద్రంలో కీల కంగా వుండేది. ఉదాహరణకి కేంద్రంలో ఒక సమయంలో తెలుగుదేశం పార్టీ 36 స్థానాలతో లోక్సభలో అతిపెద్ద ప్రతి పక్ష పార్టీగా వ్యవహారించగలిగింది. అదేసమయంలో తమిళ నాడు, ఆంధ్రప్రాంతానికి చెందిన అధికారులు కూడా కేంద్రం లో ఎక్కువగా వుండేవారు. దాంతో కేంద్రంలో ఏపనైనా వేగంగా జరిగేది. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణ 17 లోక్సభ స్థానాలకు మరిమితం అయ్యాయి. దాంతో కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది. ప్రజలందరికీ సర్వసత్తాక సార్వభౌమ అధికారం వున్నప్పటికీ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలకు చెందిన సభ్యులు చేసిన నిర్ణయానిదే పైచేయి అవుతుంది. జనాభా ప్రాతిపదికన లేదా నిష్పత్తి ప్రకారం పునర్విభజన జరిగితే పార్లమెంటులో ఉత్తరాది రాష్ట్రాల ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, బీహార్ సంఖ్యాబలం పెరుగుతుంది. ప్రజాస్వామ్యంలో సంఖ్యా బలానిదే పైచేయి. చట్టసభలలో మెజారిటీ సభ్యుల నిర్ణయాలను మైనారిటీ సభ్యులు భరించాల్సిందే.


-అన్నవరపు బ్రహ్మయ్య

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News constituencies Delimitation electoral reform latest news Parliament seat increase Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.