📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

Nallamala Sagar : ‘నల్లమలసాగర్’ పై ఢిల్లీ వేదికగా పోరు

Author Icon By Sudheer
Updated: January 28, 2026 • 10:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన నల్లమల సాగర్ ప్రాజెక్టు అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంగా మారి, ఢిల్లీ వేదికగా రాజకీయ రణరంగంగా పరిణమించింది. ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, తన పోరాట వ్యూహాన్ని మార్చింది. ఇప్పటివరకు కేవలం లేఖల ద్వారా నిరసన తెలిపిన సర్కార్, ఇప్పుడు కేంద్రం సాక్షిగా అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నెల 30న (జనవరి 30) ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమావేశాన్ని ఇందుకు వేదికగా ఎంచుకుంది.

Nandigam Suresh: దంపతుల నుంచి ప్రాణహాని ఉందంటూ వ్యక్తి ఆరోపణలు

నల్లమల సాగర్ వంటి ప్రాజెక్టులు అక్రమమని, వీటికి ఎటువంటి అనుమతులు లేవని నిరూపించేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ఆధారాలను సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టును నిలువరించకపోతే సమావేశానికి హాజరు కాబోమని గతంలోనే హెచ్చరించిన తెలంగాణ, ఇప్పుడు వ్యూహాత్మకంగా ఆ సమావేశంలోనే ఏపీ అక్రమ నిర్మాణాలను ఎండగట్టాలని భావిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో, నల్లమల సాగర్ ద్వారా ఏపీ అదనపు నీటిని తరలించే ప్రయత్నం చేస్తోందని గణాంకాలతో సహా వివరించడానికి సిద్ధమైంది.

నల్లమల అడవుల గుండా సాగే ఈ ప్రాజెక్టు పర్యావరణపరంగా కూడా ముప్పు అని తెలంగాణ వాదిస్తోంది. ఈ వివాదం కేవలం రెండు రాష్ట్రాల మధ్యే కాకుండా, కేంద్ర జలశక్తి శాఖ పరిధిలో ఒక క్లిష్టమైన సమస్యగా మారింది. 30న జరిగే భేటీలో కేంద్రం ఏ రకమైన మధ్యవర్తిత్వం వహిస్తుంది? తెలంగాణ సమర్పించిన సాక్ష్యాధారాలపై ఏపీ ఏ విధంగా స్పందిస్తుంది? అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ పోరులో పైచేయి సాధించేందుకు అటు అమరావతి, ఇటు హైదరాబాద్‌లలో అధికారులు నిరంతరం కసరత్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

delhi Google News in Telugu Latest News in Telugu Nallamala Sagar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.