ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Delhi) ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను(Nirmala Sitharaman) కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు రాబోయే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించి, అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలు విజ్ఞాపన పత్రాలను కేంద్ర మంత్రికి సమర్పించారు.
చంద్రబాబు రాయలసీమను రాబోయే మూడు సంవత్సరాలలో హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేయడానికి సుమారు రూ. 41,000 కోట్లు అవసరమని, దీనికి ప్రత్యేక బడ్జెట్ ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. అలాగే, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి సమస్యలు తీర్చేందుకు పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు కు కేంద్రం ఆర్థిక మద్దతు ఇవ్వాలని విన్నతి చేశారు.
Read also: Andhra Pradesh: ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ
పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా మద్దతు
చంద్రబాబు, ‘పూర్వోదయ’, ‘సాస్కీ’ (SASKY) పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్(Delhi) అభివృద్ధికి కేంద్రం అండగా నిలవాలని కోరారు. పూర్వోదయ పథకం కింద గ్రామీణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని, సాస్కీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న యూనిటీ మాల్, గండికోట పర్యాటక ప్రాజెక్టులు, కొత్త మౌలిక సదుపాయాల కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 10,054 కోట్లు మంజూరు చేయాలని సమర్పణలో పేర్కొన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి ఈ కీలక ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని అభ్యర్థించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: