📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Groundwater : అడుగంటుతున్న భూగర్భజలాలు!

Author Icon By Sudha
Updated: February 4, 2026 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జలం జీవనాధారం. నీరు ఎక్కడుంటే అక్కడ జీవం ఉంటుంది. అందుకే ‘ఎప్పుడు ఎడ తెగక పారు యేరు.. ‘ఉన్నచోటే ఎంపిక చేసుకోమన్నాడు సుమతీ శతకకారుడు. బర్రె పోతేకానీ పాడి సంగతి తెలియదంటారు. బావి ఎండిపోతే నీటి విలువ తెలుస్తుంది. వేసవి వస్తున్నదంటే మంచినీటికి కటకటలాడాల్సిన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలని ప్రజలు ఆందోళన చెందడం సర్వసాధారణ మైపోతున్నది. పాలకుల అసమర్థత, కొందరు అధికారుల అవినీతి, అవ గాహనారాహిత్యంతో పాటు ప్రకృతి సహాయనిరాకరణ కూడా తోడుకావడంతో అందుబాటులో ఉన్న కలుషిత నీటిని తాగి రోగాల బారిన పడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా ఎంతో సాధించా మని చెప్పుకుంటున్నా ఇప్పటికీ దేశంలోని ప్రజలందరికీ కనీస అవసరమైన గుక్కెడు స్వచ్ఛమైన నీరు అందించ లేని దురదృష్టపు పరిస్థితుల్లో ఉన్నాం. అలాని నీటి సమస్య పరిష్కారం కోసం ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదని చెప్పడం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. పెడుతున్నా రు. కానీ వ్యయం చేస్తున్న నిధుల్లో ఏ మేరకు క్షేత్ర స్థాయి వరకు వెళ్లి ప్రజలకు ఉపయోగపడుతున్నాయనేదే ప్రశ్న. కరవుల్లోనే కాదు వర్షాలు సమృద్ధిగా కురిసిన సం వత్సరాల్లో అనేక ప్రాంతాల్లో మంచినీటి సమస్యతీవ్రంగా ఉంటుంది. గత రెండు, మూడేళ్లుగా వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి పడుతున్నాయి. దేశవ్యాప్తంగా చూసినా వర్షాలు ఈ యేడాది సమృద్ధిగానే కురిసినట్టు అధికార లెక్కలు చెప్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురువగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం లో కూడా నీటికి కటకటలాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా దాదాపు రెండువందల జిల్లాల్లో తక్కు వ వర్షపాతం కురిసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి వేసవిలో నీటికొరత తీవ్రంగా ఉండే అవకాశాలు న్నట్లు భూగర్భశాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. బోరు బావుల వినియోగం దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపో తున్నది. విద్యుత్ డిమాండ్ తోపాటు నీటి వృధా కూడా పెరుగుతున్నదనే చెప్పొచ్చు. ముఖ్యంగా వ్యవసాయ రం గంలో ఉచిత విద్యుత్ నీటివృధాను భారీగా పెంచుతు న్నది. మరొకపక్క తగ్గిపోతున్న భూగర్భజలాల భర్తీకి అవసరం మేరకు ప్రయత్నాలు జరగకపోవడంతో దేశం లోని అనేక రాష్ట్రాల్లో నీటి మట్టాలు పడిపోతున్నాయి. ప్రపంచంలో మరెక్కడాలేని విధంగా భారత్లో యేటా 250 ఘనపు కిలోమీటర్ల మేర భూగర్భజలాలు వినియో గిస్తున్నారు. దీనిపై ఏదో నామమాత్రపు నిబంధనలు ఉన్నా పట్టించుకోవడం లేదు. వాస్తవంగా దేశంలో ఆరు వేల ఐదువందల డెబ్భైరెండు భూగర్భ జలాల బ్లాకులు ఉండగా వాటిలో మూడోవంతు బ్లాకులను అవసరానికి మించి వాడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు పూర్తిగా అంతమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు నని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ విధానాల వల్ల సన్నకారు, చిన్నకారు, మధ్యకారు రైతులు కొంతమేర లాభపడిన మాట వాస్తవమే అయినా నానాటికీ బోరుబావుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి పెరిగిపోతే అనేక అనర్థాలకు దారితీస్తున్నది. భూగర్భ జలాల వినియోగం మూడింతలు పెరగడం, నీతి నియ మాలు నీరుగారిపోతున్నాయనేందుకు సజీవ సాక్ష్యాలుగా పేర్కొనవచ్చు. పంజాబ్లో యాభైశాతం, రాజస్థాన్లో అరవైశాతం, కర్ణాటక, తమిళనాడులో నలభైశాతం భూగర్భ జలాలు అధికంగా వాడుతున్నట్లు అనధికార లెక్కలు చెబుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీతోసహా పంజాబ్, రాజ స్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో ఇష్టానుసారంగా లక్షలాది కోట్ల లీటర్ల భూగర్భజలాలు (Groundwater) తోడేస్తున్నారు. దేశంలో మూడోవంతు జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో భూగర్భజలాలు (Groundwater) తాగు యోగ్యమైనవి కావని గతంలోనే కేంద్రం అంగీకరిం చింది. పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా దేశం లో 250 జిల్లాల్లో ఇనుము, 228 జిల్లాల్లో ఫ్లోరైడ్, 129 జిల్లాల్లోక్షారత్వం, 39 జిల్లాల భూగర్భజలాల్లో పాషాణం స్థాయి అధికంగా ఉన్నట్లు కేంద్రం గతంలో వివరించింది. ఇక పాతాళంలోకి దిగజారిపోతున్న జలాలను పైకి తోడడానికి అటు విద్యుత్ కానీ, ఇటు డీజిల్ కానీ వాడకం పెరిగిపోతున్నది. ఇంకొకపక్క రాబోయే వేసవిలో మంచినీటి కొరతను ఆసరాగా చేసుకొని కొందరు దళారులు వ్యాపారం విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వేసవి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాల్లో నగరాలు, పట్టణాల్లో మంచినీటి వ్యాపారం అదుపు లేకుండాపోతున్నది. ఇప్పుడు ఈవ్యాపా రం నగరాలకేకాక, మండల కేంద్రాలకు, గ్రామాలకు శివారు పల్లెలకు కూడా విస్తరించింది. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా మంచినీటి పేరుతో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతున్నాఅడిగేవారు, అడ్డగిం చేవారు లేకుండాపోతున్నారు. కలుషితనీరు అనేక వ్యాధు లకు కారణాలవుతున్నాయి. పాలకులు మంచినీటి విష యంలో ప్రత్యేక చర్యలుతీసుకోవాల్సిన అవసరం ఉంది. భూగర్భజలాల మట్టాలు తగ్గిపోవడం మానవాళికి ఏ మాత్రం క్షేమంకాదు. ఇంకొకపక్క లక్షలాది ఎకరాలకు సరి పోయే వేలాది టిఎంసిల నీరు వివిధ నదుల ద్వారా పొంగిపొర్లి యేటా సముద్రంపాలవుతున్నది. ప్రజల్లో అవ గాహనలోపం కారణంగా భూగర్భజలాల సమస్య రాను రాను తీవ్ర రూపం దాల్చుతున్నది. మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటి నుంచేపటిష్టమైన ప్రణాళికతో యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

Breaking News environment groundwater Groundwater Depletion latest news Telugu News Water Crisis water scarcity

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.