Davos: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరానికి చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో ప్రవాస ఆంధ్రులు ఆయనకు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also: Andhra Pradesh: నేడే యోగి వేమన జయంతి వేడుకలు
ప్రపంచ స్థాయి నేతలతో కీలక భేటీలు
జ్యూరిక్‌లో సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం(Tharman Shanmugaratnam), అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో పాటు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలు, పెట్టుబడులు, రాష్ట్రాల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ భేటీల అనంతరం దావోస్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సమావేశాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. జ్యూరిక్ నుంచి రోడ్డుమార్గం ద్వారా దావోస్‌కు వెళ్లి సదస్సు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: