ఏపీలో ప్రత్యామ్నయ ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి ప్రోత్సాహం అందిస్తామని ఏపీ మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అన్నారు. దావోస్లో(Davos) జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వివిధ దేశాలకు చెందిన వ్యాపార వేత్తలు, సీఈఓలతో భేటీ అవుతూ ఏపీ మంత్రి నారా లోకేశ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో జపాన్కు చెందిన ప్రముఖ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ జెరా గ్లోబల్ సీఈవో అండ్ ఛైర్మణ్ యుకియో కానితో మంత్రి లోకేశ్ దావోస్లో భేటీ అయ్యారు.
Read Also: Tirupati: మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు ప్రవేశపెట్టాలి
గ్రీన్ అమ్మోనియా కేంద్రాల్లో పెట్టుబడులకు ఆహ్వానం
ఈ సందర్భంవగా ఆయన మాట్లాడుతూ ఏపీలోని గ్రీన్ అమ్మోనియా తయారీ కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. జపాన్, ఇతర ఆసియా మార్కెట్లకు లో కార్బన్ అమ్మోనియాను సరఫరా చేయడానికి మూలపేట, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుని సమీపంలోని గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని వారికి విజప్తి చేశారు లోకేశ్. పారిశ్రామిక వినియోగదారులకు దృఢమైన క్లీన్ ఎనర్జీ సరఫరా చేయడానికి రాయలసీమలో సౌరపవన హైబ్రిడ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని వెల్లడించారు.
జపాన్ రెన్యువబుల్ ఎనర్జీ దిగ్గజం జెరాతో భేటీ
జపాన్ భవిష్యత్తు క్లీన్ ఇంధన దిగుమతులకు మద్దతు ఇవ్వడానికి భారత్లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వాల్యూ చైన్లను ఏర్పాటు చేయాలని జెరా సంస్థ నిర్ణయించుకుంది. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ తో భాగస్వామ్యం ద్వారా యుటిలిటీస్కేల్ పునరుత్పాదక శక్తి తయారీలో భాగస్వామ్యం వహిస్తున్నట్లు జెరా సీఈవో యుకియో వెల్లడించారు. పునరుత్పాదక శక్తితో పాటు ఎల్ఎన్ ఆధారిత విద్యుత్ పరివర్తన, గ్రిడా బ్యాలెన్సింగ్ పరిష్కారాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి వచ్చేవారిని అతిథుల్లా చూస్తున్నాం. వారిని గౌరవిస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తాం. అభివృద్ధి ఏ ఒక్కరికో పరిమితం కారాదు. అందరూ భాగస్వాములు కావాలి. ఈ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలి. ఈ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వన్ ఫ్యామిలీవన్ ఎంటర్ప్రెన్యూర్ విధానానికి శ్రీకారం చుట్టిందని వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: