📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Superstitions : మృత్యుపాశాలుగా మూఢనమ్మకాలు

Author Icon By Sudha
Updated: January 30, 2026 • 4:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అన్ని తెలిసిన వారు అమావాస్యనాడు చని పోతే ఏమీ తెలియనివారు ఏకాదశి రోజు చని పోయినట్లుగా ఉంది. ఒకపక్క సాంకేతిక పరిజ్ఞా నంతో ఎంతో అభివృద్ధి చెందుతున్నా మరొక పక్క సైన్స్ విజ్ఞానం రోజురోజుకు పురోగాభివృద్ధివైపు పరుగు లీడుతున్నా, మరొకపక్క మూఢనమ్మకాలు సమాజాన్ని అతలాకుతలం చేస్తుండడం అత్యంత దురదృష్టకరం. అం దులోనూ ఏమీ తెలియని అమాయకులు మూఢనమ్మకా లలో మునిగిపోతున్నారంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ అంతోఇంతో చదువుకున్నవారు లోకజ్ఞానం ఉన్నవారు పట్టణాలకు, నగరాలకు చేరువలో నివాసాలు ఉంటున్నవారు సైతం ఈ మూఢనమ్మకాలతో బజారు పాలవుతున్నారు. ఒకరుకాదు ఇద్దరు కాదు దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు వీధినపడుతున్నాయి. ఎన్నోయేళ్లు గా కూడబెట్టుకున్న బంగారం, డబ్బులే కాదు, చివరకు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఎంతోమంది తమ కుటుంబ సభ్యులను తమ కళ్లముందే భూత
వైద్యుల, మంత్రాల పేరుతో పెట్టే చిత్రహింసలనుచూస్తూ మనస్సు ను చంపుకొని ఏదో ఆశతో ఎదురుచూసి చివరకు కళ్ల ముందే ప్రాణాలు వదిలిన తర్వాత కానీ వారికి అసలు విషయం బోధపడడం లేదు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోతున్నది. ఆ మధ్య నెల్లూరు జిల్లాలోఇరవైరెండేళ్ల యువకుడు మతిస్థిమితం కోల్పోవడంతో దెయ్యం పట్టిం దని ప్రచారం చేశారు. దానికి సలహా ఎవరు ఇచ్చారో ఏమోకానీ స్వామిజీ వద్దకు తీసుకువెళ్లారు. దెయ్యం కుట్టిన మాట వాస్తవమేనని దాన్ని పూర్తిగా వదిలిస్తామని నమ్మబలికి పసుపు, కుంకుమ వంటివి అన్నీ చల్లి చుట్టు పక్కల వారిని పిలిచి అందరు చూస్తుండగానే నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలు పెట్టారు. కొంతసేపటికి ఆ యువకుడిలో చలనం లేకుండాపోయింది. దీంతో దెయ్యం పోయిందంటూ ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొందరు గ్రామపెద్దలు వచ్చి యువకుడు చనిపో యాడని చెప్తేకానీ వారికి అసలు విషయం తెలియదు. భూతవైద్యం పేరుతో నిండుప్రాణం గాలిలో కలిసిపోయిం ది. అలా ఎన్నో ప్రాణాలు ఈ మూఢనమ్మకాలకు (Superstitions) బలైపో తున్నాయి. ఆ మధ్య రాయలసీమలో ఒక జిల్లాలో నర బలి ఇచ్చిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. తమ వ్యతిరేకులను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టేందుకు కొందరు చేతబడి, బాణామతి, చిల్లంగి అంటూ అనేక పేర్లతో క్షుద్రపూజలు చేస్తూ భయపెడుతున్నారు.

గ్రామాల్లో విషజ్వరాలు వ్యాపించినప్పుడు ఇలాంటి క్షుద్ర పూజలు, జంతుబలులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సార్లు కొందరు చేతబడులు చేయడంవల్లనే తమ కుటుం బాలకు, గ్రామాలకు నష్టం జరుగుతున్నదని అపోహతో ఆరోపణలు చేసి దాడులకు పాల్పడి ప్రాణాలు తీసిన సంఘటనలు కూడా కోకొల్లలు. కొన్నిసార్లు క్షుద్ర పూజలు చేశారనే అనుమానంతో వారి కుటుంబాలను సజీవంగా దగ్ధం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు బంగారం భూమిలో ఉందంటూ క్షుద్రపూజలు చేసి నర బలులు ఇస్తే నిధులు దక్కించుకోవచ్చునన్న భ్రమతో అన్నెం పున్నెం ఎరుగని చిన్న పిల్లలను బలిచ్చిన సంఘటనలు హైదరాబాద్ నగరపరిసరాల్లో గతంలో జరిగాయి. ఉభయ రాష్ట్రాలతోపాటు, బీహార్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర పదిహేను రాష్ట్రాల్లో క్షుద్రపూజలు దశాబ్దాల తరబడి వేళ్లూనుకుపోయాయి. దేశవ్యాప్తంగా వీటి కారణంగా గతదశాబ్దకాలంలో రెండు వేల మందికిపైగా హత్యలకు గురైనట్లు సమాచారం. అధిక శాతం మహిళలే బలైపోతున్నారని జాతీయ గణాంకాల శాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి. జార్ఖండ్లో చేతబడులు చేశారన్న అనుమానంతో 2013లోనే దాదాపు అరవైమంది కిపైగా చంపారు. ఇక మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో పదకొండు మంది చిన్నారులను బలిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఒక స్వామిజీ ఇచ్చిన సలహా మేరకు ఒక జంట అత్యంత కిరాతకంగా మారి అభంశుభం తెలియని ఐదుగురు పసికందులను పొట్టనపెట్టుకున్నారు. ఆతర్వాత పోలీసు దృష్టికి వెళ్లడంతో వారికి సంకెళ్లు వేయడంతో అవి ఆగిపోయాయి. దేశవ్యాప్తంగా వెలుగుచూడని పోలీసుల దృష్టికి రాని కేసులెన్నో ఉన్నాయి. జరగాల్సిన నష్టం జరి గింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు వేసే సవాలక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పలేక, కోర్టుల చుట్టూ తిరగలేక కొత్త ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో పోలీసుస్టేషన్ మెట్లెక్కడానికి భయపడుతున్నారు.

అన్నిటి కంటే ముఖ్యంగా కొన్నిసందర్భాల్లో ప్రత్యర్థులను మట్టుపెట్టడానికి బాణామతి లాంటి క్షుద్రపూజలు చేశారనిముద్ర వేసి చంపుతున్న సంఘటనలు తరచుగా చోటుచేసుకుం టున్నాయి. 2022లోనే దేశవ్యాప్తంగా ఎనభై ఐదుకుపైగా బాణామతి హత్యలు జరిగాయి. గత దశాబ్దకాలంలో పద కొండు వందల ఎనభైనాలుగు మంది ప్రాణాలు కోల్పోయా రు. ఇలా ప్రతి సంవత్సరం వెయ్యో రెండువేల మందో హతులవుతున్నట్లు సమాచారం. బాణామతి, చేతబడి వంటి మూఢనమ్మకాల(Superstitions) తో జరిగే దాడులను నిలువరించా అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 2021 లో తీర్మానాన్ని ఆమోదించింది. ఇకదాడుల గురించిప్రత్యే కంగా చెప్పక్కర్లేదు. మంత్రగాళ్లు, మంత్రగత్తెలంటూ విచ క్షణారహితంగా కొట్టి హింసిస్తున్నసంఘటనలు కోకొల్లలు. బీహార్లో 1999లోనే బాణామతి కార్యకలాపాల నిరోధక చట్టం వచ్చినా ఆశించిన ఫలితాలు చేకూరడంలేదు. ప్రభు త్వమేకాదు సమాజం, మేధావులు అందరూ ఈ సమస్య పై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు జరగాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

blind beliefs Breaking News harmful superstitions latest news myths and facts social awareness Superstitions Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.