📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Daggumalla Prasada Rao: స్వావలంబని పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో విస్తరించాలి

Author Icon By Rajitha
Updated: February 11, 2026 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

— లోక్ సభలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తూరు ఎంపి దగ్గుమళ్ల ప్రసాదరావు విజ్ఞప్తి

విజయవాడ : భారత ప్రభుత్వం ఉన్నత ఆశయంతో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన “స్వావలంబని పథకాన్ని” ఆంధ్రప్రదేశ్ లో విస్తరించి, మహిళా వ్యవస్థాపకులను ప్రోత్సహించి, మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలని కేంద్ర నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు చిత్తూరు పొర్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు. తద్వారా స్త్రీలు స్వయం సంవృద్ధిని సాధించేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు…, ప్రజా సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ పథకాలను.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గ నిర్దేశంలో ఆంధ్రప్రదేశ్కు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.

Read also: Krishna District: పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

Swavalambani scheme should be expanded in Andhra Pradesh

ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన “స్వావలంబని పథకాన్ని” ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తన వంతు పాటుపడున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం లోక్ సభలో స్వావలంబని పథకానికి సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా కోరినట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు (MP Daggumalla Prasada Rao) తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా దేశవ్యాప్తంగా స్వావలంబిని పథకం కింద ఉన్నత విద్యా సంస్థల సంఖ్య ఎంత..? వ్యవస్థాపకత అవగాహన కార్యక్రమం వ్యవస్థాపకత అభివృద్ధి కార్యక్రమం కింద నమోదు చేసుకున్న మహిళా విద్యార్థుల మొత్తం సంఖ్య..? ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యా సంస్థలకు కార్యక్రమాన్ని విస్తరించినందుకు ప్రభుత్వం ప్రణాళికలు కలిగి ఉందా..? అయితే కవర్ చేయాలని ప్రణాళిక చేసిన సంస్థల సంఖ్యతో పాటు టైం వివరాలేంటి..?

స్వయం సమృద్ధి కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం

అలాగే స్వావలంబిని పథకం అమలు కోసం కేటాయించిన, ఆమోదించబడిన, విడుదల చేసిన మొత్తం నిధుల వివరాలు, విత్త నిధులు, మెంటర్న్షిప్, అవార్డుల కోసం కేటాయించిన ఫండెంత..? అదేవిధంగా ప్రభుత్వం, స్వావలంబిని పథకం కింద నైపుణ్య అభివృద్ధి సంస్థల మధ్య ఏవైనా భాగస్వామ్యాలు లేదా అవగాహన ఒప్పందాలు ఏర్పాటు చేయబడ్డాయా, అయితే, దాని వివరాలేంటి..? కార్యక్రమం ఫలితాలను ట్రాక్ చేయడానికి ఏదైనా పర్యవేక్షణ లేదా అంచనా విధానం ఉందా..? అన్న అంశాలకు సంబంధించిన వివరాలను లోక్ సభలో కేంద్ర నైపుణ్య అభివృద్ధి. వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ కోరినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధిత శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తక్షణం స్పందించి, లిఖిత పూర్వకంగా తమకు సమాధానం ఇచ్చినట్లు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Chittoor MP Daggumalla Prasada Rao latest news Lok Sabha Swavalambani Scheme Telugu News Women Entrepreneurship

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.