📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Nellore crime news today: ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

Author Icon By Siva Prasad
Updated: January 30, 2026 • 11:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nellore crime news today: అంతేలేని అవినీతికి పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన దగదర్తి తాశిల్దార్ పాల కృష్ణ ఇంటితోపాటు, అతని బంధువులు స్నేహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.కోట్ల విలువచేసే ఆస్తులను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను నెల్లూరు ఏసీబీ డిఎస్పి రామకృష్ణుడు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. బుచ్చిరెడ్డిపాలెం కు చెందిన పాల కృష్ణ 2017లో డిప్యూటీ తాసిల్దారుగా రెవిన్యూ శాఖలో ఉద్యోగం పొందారు.

Read Also:ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్

అప్పటినుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం దగదర్తి మండల తాసిల్దారుగా ఉద్యోగ బాధ్యతలో ఉన్నారు. ఇతనిపై పలు ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో నెల్లూరు(Nellore crime news today) నగరం టైలర్స్ కాలనీ ప్రాంతంలోని కృష్ణ ఇంటి తోపాటు బుచ్చిరెడ్డిపాలెంలోని అతని ఇల్లు, బంధువులు స్నేహితుల ఇళ్లతో పాటు దగదర్తి తాసిల్దార్ కార్యాలయంలో దాడులు చేపట్టి సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు అక్రమాస్తులను ఎసిబి అధికారులు గుర్తించారు. నెల్లూరు నగరంలో జి ప్లస్ త్రీ భవనం, ఇంట్లో 398 గ్రాముల బంగారు ఆభరణాలు, పలుచోట్ల విలువైన స్థలాలను సంబంధించిన డాక్యుమెంట్లు, రూ. లక్ష నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దగదర్తి లోని తాసిల్దార్ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగాయి. ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 20 కోట్ల పైబడి ఉంటుందని ప్రాథమిక అంచనా. రోగాలు శుక్రవారం రాత్రి కూడా కొనసాగుతాయని శనివారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని డిఎస్పి తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ACB DSP Ramakrishnudu Nellore ACB raids in Andhra Pradesh 2026 Buchireddypalem ACB raids Dagadarthi MRO ACB case Dagadarthi Tahsildar Pala Krishna Nellore ACB raids Nellore crime news today Palakrishna assets value Palakrishna disproportionate assets case revenue department corruption cases AP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.