📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest news: D.CM Pawan: రాష్ట్ర అంశాలపై పార్లమెంట్లో గట్టిగా గళం విప్పాలి

Author Icon By Saritha
Updated: December 1, 2025 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పోలవరం, అమరావతి ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్న డి.సిఎం పవన్

విజయవాడ : పార్లమెంటులో రాష్ట్ర ప్రభుత్వం(D.CM Pawan) డిమాండ్లను ప్రస్తావిస్తూ, మనం గుర్తించిన ఇతర సమస్యలను పరిష్కరించే దిశలో జనసేన వాణి ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి అంశంపై ఎన్డీఏ కూటమి సభ్యులు సమాలోచన చేయాలని, తరువాత పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు.

Read also: వ్యవసాయ, అణుశక్తి, బీమాలో సంస్కరణలు

DCM Pawan wants to focus on Polavaram and Amaravati projects

పార్లమెంట్ వ్యూహాలపై కీలక చర్చ

అమరావతిలో(D.CM Pawan) లోక్సభ సభ్యులు బాలశౌరి, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్ లో గట్టిగా గళం విప్పాలని సూచించారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన చర్చల్లో చురుగ్గా పాల్గొనేందుకు ముందస్తుగా సిద్ధం కావాలని ఎంపీలకు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు సంబంధిత కేంద్ర మంత్రులతో సమావేశమై, వివరణాత్మక నివేదికలు అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న సహకారం చాలా కీలకమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు కేంద్ర పథకాల ద్వారా రావాల్సిన నిధులపై రాష్ట్ర అధికారులతో సమీక్షి ంచి, ఆ వివరాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Amaravati Capital Andhra Pradesh Deputy CM Jana sena Latest News in Telugu Parliament Strategy Pawan Kalyan Polavaram Project

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.