📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: D.CM Pawan: ఖాకీ దుస్తుల గౌరవాన్ని కానిస్టేబుళ్లు నిలబెట్టాలి

Author Icon By Saritha
Updated: December 17, 2025 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కానిస్టేబుల్ ఉద్యోగం పోలీస్ వ్యవస్థకు మూల స్తంభం

విజయవాడ : “కానిస్టేబుల్ ఉద్యోగం పోలీస్ వ్యవస్థకు మూల స్థంభం లాంటిది. మీరు లేకపోతే పోలీస్ వ్యవస్థకు జీవం లేదు. ధైర్యమూ ఉండదు. మీ ఒంటిపై ఉన్న ఖాకీ డ్రస్సు కనబడితే ప్రజలకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. (D.CM Pawan) ఖాకీ.. సమాజానికి రక్షణ కవచం వంటిది. అలాంటి ఖాకీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు” అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. శాంతిభద్రతలపైనే దేశాభివృద్ధి అయినా, రాష్ట్రాభివృద్ధి అయినా ఆధారపడి ఉంటుందన్నారు. అలాంటి శాంతిభద్రతలను పరిరక్షించే మీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులన్నారు. నియామక పత్రాలు స్వీకరించిన కానిస్టేబుళ్లంతా శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

Read also: abarimala: పంబ వద్ద రోడ్డు ప్రమాదం.. ఏపీ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

Constables must uphold the dignity of the khaki uniform.

శాంతి భద్రతలే రాష్ట్ర అభివృద్ధికి పునాది

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,(D.CM Pawan) తాను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే పాలనలో సుస్థిరత కోసం, యువత భవిష్యత్తు కోసం నిలబడతామని మాటిచ్చాం. మేము అధికారంలోకి వచ్చేనాటికి అవినీతి వ్యవస్థీకృతమై ఉంది. వ్యవస్థీకృతమైన అవినీతిని పారదోలేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) దృష్టికి తీసుకువెళ్లి.. పంచాయతీరాజ్ శాఖలో పది వేల పైచిలుకు ఉద్యోగులకు ఒకేసారి పదోన్నతులు కల్పించాం. చంద్రబాబు దార్శనికత, సలహాలు, సూచనలతోనే అత్యతం పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయగలిగాం. అదే కోవలో ఈ రోజున ఆరు వేల మందికి ఒకేసారి నియామక పత్రాలు అందిస్తున్నాం. సంఘటిత నేరాల నియంత్రణపై దృష్టి సారించండి, పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడిన ఉద్యోగం, పోలీస్ విధుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, ప్రజల పట్ల సేవాభావం ముఖ్యం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, వారి హక్కులకు భంగం వాటిల్లినా, అన్యాయం జరిగినా మొదట గుర్తుకు వచ్చేది పోలీసులే. శాంతి భద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ మీ చేతుల్లోనే ఉంటాయి. మీ విధులు మీరు సక్రమంగా నిర్వహిస్తే సమాజం ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు 15 శాతం ఆర్ధికాభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని మాకు చెబుతూ ఉంటారు.

ప్రజలకు భరోసా, పోలీసులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది

శాంతి భద్రతలు బలంగా ఉంటేనే అది సాధ్యపడుతుంది. ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కి వెళ్తే పోలీసులు ఇబ్బంది పెడతారేమో అన్న భావన ప్రజల నుంచి పోవాలి. అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులకు నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉన్నతాధికారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్లారు. ఇలాంటి వ్యవస్థల్లో మార్పు తెచ్చేందుకు మేము బలంగా నిలబడతాం. అందుకు మీ నుంచి సంపూర్ణ మద్దతు కోరుకుంటున్నాం. ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ అధికారులను బెదిరించినా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు. చాలా బలంగా తీసుకుంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు అండగా ఉండండి. మీకు మేము అండగా ఉంటాం. కూటమి ప్రభుత్వం ప్రజల మానప్రాణ సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు. ప్రాధాన్యత ఇస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో తరతమ భేదాలు చూడం. కులం, మతం, ప్రాంతీయత అనే తేడాలు చూడం. కొత్త కానిస్టేబుళ్లంతా అదే పంధాను అనుసరించాలి. మీ ఉద్యోగ జీవితంలో మీరు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh police coalition government criticism Constable Recruitment Latest News in Telugu Law and order Pawan Kalyan Public Safety Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.