📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Cyclone: మరో రెండురోజులు అప్రమత్తంగా ఉండాలి: నారా లోకేశ్

Author Icon By Sushmitha
Updated: October 29, 2025 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మొంథా తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో, ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. తుఫాన్ అనంతర పరిస్థితులపై విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు. తుఫాన్ నష్టం, సహాయక చర్యలపై లోకేశ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Bihar Elections: బీహార్ లో నువ్వా నేనా అంటూ ఎన్డీయే కూటమి ఆర్జేడీ

సహాయక చర్యలు, మౌలిక వసతుల పునరుద్ధరణ

మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, “రాబోయే 48 గంటల పాటు అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని గృహాలు, వాణిజ్య సముదాయాలకు వందశాతం విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలి. భారీ వర్షాల కారణంగా రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ చర్యలు తీసుకోవాలి” అని ఆదేశించారు. దెబ్బతిన్న వంతెనలు, కల్వర్టులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. చెరువులు, కుంటలు, కాలువ గట్లను పటిష్టపరిచేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.

పంట నష్టం, ఆరోగ్య భద్రత

పంట నష్టం అంచనాలను వెంటనే రూపొందించాలని, దెబ్బతిన్న పంటలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని లోకేశ్ సూచించారు. మొంథా(Montha) తీవ్ర తుపాను కారణంగా సంభవించిన ప్రాణ నష్టం, దెబ్బతిన్న నిర్మాణాలపై పూర్తి నివేదిక అందించాలని కోరారు. “ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పాముకాటుకు ఉపయోగించే యాంటీ వీనం ఔషధాలను అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలి. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తుఫాన్ బాధితులు, మత్స్యకారులకు అవసరమైన నిత్యావసర సరకులను వెంటనే పంపిణీ చేయాలి” అని లోకేశ్ అధికారులను ఆదేశించారు.

తుఫాన్ అనంతర చర్యలపై మంత్రి లోకేశ్ అధికారులకు ఇచ్చిన ప్రధాన ఆదేశం ఏమిటి?

రాబోయే 48 గంటలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి, గృహాలు, వాణిజ్య సముదాయాలకు వందశాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి.

పంట నష్టం అంచనాలను ఎప్పుడు రూపొందించాలని సూచించారు?

పంట నష్టం అంచనాలను వెంటనే రూపొందించాలని లోకేశ్ సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

AP government. Crop damage assessment Disaster Relief Google News in Telugu Heavy Rainfall Latest News in Telugu montha cyclone Nara Lokesh post-cyclone recovery Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.