Cyclone: ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మరోసారి తుఫాను ప్రభావం చుట్టేస్తోంది. ‘మొంథా’ తుఫాన్ ప్రస్తుతం సముద్రంలో సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, దాని దూరం ఎక్కువగానే ఉన్నప్పటికీ, వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య పార్వతీపురం జిల్లాలో 34.7 డిగ్రీల సెల్సియస్, NTR జిల్లాలో 34.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, మధ్యాహ్నం సమయానికి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగి 36–37 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉంది.
Read also: Montha Cyclone: మొంథా తుఫాన్.. ఏపీ స్కూళ్లకు 3 రోజులు సెలవులు

Cyclone: తుఫాను వేళ ఎండ.. దేనికి సంకేతo
తుఫాను ముందు ఎండ ఎందుకు పెరుగుతుంది?
Cyclone: నిపుణుల ప్రకారం, తుఫాన్ సముద్రంపై తేమను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఈ సమయంలో భూమి మీద తేమ తక్కువవడంతో వాతావరణం ఎండగా, పొడిగా మారుతుంది. దాంతో సూర్యకిరణాల ప్రభావం పెరిగి ఉష్ణోగ్రతలు ఎక్కువవుతాయి. తుఫాన్ 300 కిలోమీటర్ల దూరం వరకు దగ్గరయ్యాకే దాని వర్షప్రభావం భూమిపై స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటివరకు ఆకాశం ఎండగా కనిపించినా, అది తుఫాన్ రాకకు ముందు ఉండే సహజ సూచన అని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
భూమి వేడి – తుఫాన్ తీవ్రత
భూమి వేడెక్కినప్పుడు గాలుల చలనం పెరుగుతుంది. దీనివల్ల తుఫాన్ బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఎండ ఎక్కువగా ఉందని తుఫాన్ దూరమైందని కాదు ఇది రానున్న వర్షాల సంకేతం కూడా కావచ్చు.
తుఫాను వేళ ఎండ ఎందుకు పెరుగుతుంది?
తుఫాన్ సముద్రంలో తేమను ఆకర్షించడం వల్ల భూమిపై తేమ తగ్గుతుంది. దాంతో వాతావరణం పొడిగా మారి ఎండ తీవ్రత పెరుగుతుంది.
తుఫాన్ ఎంత దూరంలో ఉన్నప్పుడు వర్షం మొదలవుతుంది?
సాధారణంగా తుఫాన్ 300 కిలోమీటర్ల దూరం వరకు చేరిన తర్వాత దాని ప్రభావం భూమిపై కనిపిస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: