నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ వ్యవస్థ శుక్రవారం ఉదయానికి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘ఓర్ణబ్’ (Cyclone Ornab)అనే పేరును ఖరారు చేశారు.
Read also: Weather: బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం
ప్రస్తుతం ఈ వాయుగుండం శ్రీలంకలోని పొట్టువిల్‌కు సుమారు 250 కిలోమీటర్లు, చెన్నైకు దాదాపు 940 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వాయవ్య దిశగా కదులుతోంది. శుక్రవారం రాత్రి శ్రీలంక తీరంలోని పొట్టువిల్–ట్రింకోమలి మధ్య ప్రాంతాన్ని ఇది దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఈ తుపాను(Cyclone Ornab) ప్రభావంతో శుక్రవారం, శనివారం రోజుల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. విశాఖపట్నం, కడప, అనంతపురం వంటి ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తర కోస్తాలో పొగమంచు హెచ్చరిక
రాబోయే నాలుగు రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో శుక్రవారం నుంచి సోమవారం వరకు దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: