నైరుతి బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడింది. తుఫాన్ (Dithwa Cyclone) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ హెచ్చరించింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ప్రస్తుతం ఈ తుపాను శ్రీలంక తీరానికి సమీపంలో,
Read Also: Amaravati: అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన
వేటకు వెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు
ట్రింకోమలీకి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పుదుచ్చేరికి 480 కి.మీ, చెన్నైకి 580 కి.మీ దూరంలో ఉన్న ఈ తుపాను, గడిచిన ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది. ఆదివారం నాటికి ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాల సమీపానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో విపత్తుల ప్రతిస్పందన సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కీలక సూచనలు జారీ చేశారు. తుపాను (Dithwa Cyclone) ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అందువల్ల మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా, రైతులు కూడా తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: