📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Cyber ​​crime: డిజిటల్ అరెస్ట్ తో 48 లక్షలు దోచుకున్న ముగ్గురు అరెస్ట్

Author Icon By Saritha
Updated: December 2, 2025 • 10:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రూ. 39 లక్షలు, 25 ఎటిఎం కార్డులు స్వాధీనం

మదనపల్లె క్రైమ్ : మదనపల్లి(Cyber ​​crime) కేంద్రంగా “డిజిటల్ అరెస్ట్” పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ సైబర్ నేర ముఠాను మదనపల్లి 1టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన పఠాన్ ఇంతియాజ్ ఖాన్, షేక్ అమీన్, షేక్ హర్షద్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం రాయచోటిలో మీడియాకు వెల్లడించారు. పి కథనం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి. మదనపల్లెకు చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ మేల్ నర్సు రేపురి బెంజిమెన్ను లక్ష ్యంగా చేసుకున్న నిందితులు, సీబీఐ, ఈడీ అధికారుల మంటూ బెదిరించారు, మీ మీద కేసు ఉంది అంటూ బెంజిమెన్ ను ఫోన్ ద్వారా భయపెట్టారు.

Read also: వైకుంఠ ద్వార దర్శనం.. నేడు ఈ-డిప్

Three arrested for stealing Rs 48 lakhs through digital fraud

డిజిటల్ అరెస్టు పేరిట మోసం..1930కి కాల్ చేయాలని ఎస్పీ సూచన

డిజిటల్ అరెస్ట్(Cyber ​​crime) పేరుతో వీడియో కాల్లో ఉంచి మీ పాన్ కార్డు ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన ఓ ముఠా 48 లక్షల రూపాయలు మోసం చేశారని దీనికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ బెదిరించారు. వెంటనే అమోంటు పంపకపోతే పక్కనే ఉన్న మా పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారంటూ భయపెట్టి రూ.48 లక్షలు బదిలీ చేయించుకున్నారు. అనంతరం మోసపోయానని తెలుసుకున్న బెంజిమెన్ మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు దర్యాప్తులో భాగంగా రాయచోటిలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్లో నిందితులు పటాన్ ఇంథియాజ్ ఖాన్, షేక్ అమీన్, షేక్ అర్షాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.32 లక్షల నగదు, 25 ఏటీఎం కార్డులు, మొబైళ్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకోగా, ఖాతాల్లో ఉన్న రూ.7.65 లక్షలను ఫ్రీజ్ చేశారు.

ఈ ముఠా కాంబోడియా కువైట్(Cambodia Kuwait) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో ఈ ఆపరేషన్ ను విజయవంతం చేసిన డీఎస్పీ మహేంద్ర, సీఐ మహమ్మద్ రఫీ, సైబర్ సెల్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ప్రజలకు ఎస్పీ హెచ్చరిడిజిటల్ అరెస్ట్ అంటూ చట్టంలో ఇక్కడ లేదని జిల్లా ఎస్పీ సూచించారు. ఎవరూ వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయటం, ఆన్లైన్లో డబ్బులు అడగటం ఉండదన్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానం వచ్చిన వెంటనే 1930 కు కాల్ చేయాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Cambodia Kuwait Cyber Gang Cyber Crime Digital Arrest Scam Latest News in Telugu Madanapalle Crime Online Fraud

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.