చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సోషల్ మీడియా స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారం, అసభ్య వ్యాఖ్యలు చేయడం నేరమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు స్థానం ఉన్నా, అవి మర్యాదా పరిమితుల్లో ఉండాలని సూచించారు.
Read Also: Minister Savita: బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.90.50 కోట్లు మంజూరు
అసభ్య పోస్టులపై కూటమి నేతలకైనా కఠిన చర్యలు
సోషల్ మీడియా ద్వారా సమాజంలో విద్వేషాలు(Cyber Crime) రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగితే ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని తెలిపారు. మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులను లక్ష్యంగా చేసుకుని అవమానకర పోస్టులు పెడితే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, అందుకే సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి(Cyber Crime) పెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. పోలీసు విభాగం సోషల్ మీడియా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని, చట్టాన్ని అతిక్రమించే వారిపై వేగంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాను అభిప్రాయాల వ్యక్తీకరణకు ఉపయోగించుకోవాలని, కానీ దుర్వినియోగానికి పాల్పడితే మాత్రం చట్టపరమైన పరిణామాలు తప్పవని సీఎం స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: