📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Cultural Program: రామకృష్ణ నాట్యమండలి స్వర్ణోత్సవ వేడుకలు కళారంగానికి స్ఫూర్తిదాయకం

Author Icon By Ramya
Updated: July 22, 2025 • 12:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐదుగురు ప్రముఖులకు విశిష్ట కళా సేవక్ పురస్కారాలు

విజయవాడ : ఒక పౌరాణిక నాటక సంస్థ 50 వసంతాలు పూర్తి చేసుకోవడం అపూర్వమైనటువంటి విషయమని మచిలీపట్నం పురపాలక సంస్థ చైర్మన్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ (Motamarri Baba Prasad) అన్నారు. రామకృష్ణ నాట్యమండలి స్వర్ణోత్సవ వేడుకలు (Cultural Program) ఘనంగా జరిగాయి. మండలి 50 వసంతాల వేడుక సందర్భంగా ఐదుగురికి “విశిష్ట కళా సేవక్ పురస్కారాలను” బహుకరించి సత్కరించారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ విడియాల చక్రవర్తి కి (జంధ్యాల రాధాకృష్ణ స్మారక పురస్కారం ), ప్రముఖ హార్మోనిస్టు కె. పరబ్రహ్మచారికి ( గుత్తి కొండ కోటేశ్వరరావు స్మారక పురస్కారం), విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటికి (ఆధ్యాత్మిక వేత్త జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య శాస్త్రి స్మారక పురస్కారం), ప్రముఖ గాయని వై. రాధికా సుబ్రహ్మణ్యం కు (అయినంపూడి వెంకటేశ్వరరావు స్మారక పురస్కారం) ప్రముఖ రంగస్థలం నటులు పుప్పాల వీరాంజనేయులు కు ( డి.వి. సుబ్బారావు స్మారక పురస్కారం) బహుకరించి సత్కరించారు.

Cultural Program: రామకృష్ణ నాట్యమండలి స్వర్ణోత్సవ వేడుకలు కళారంగానికి స్ఫూర్తిదాయకం

జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన వేడుకలు

Cultural Program: ఆయన జ్యోతి ప్రజ్వలనతో ఈ వేడుకలను మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మచిలీపట్టణం కవులు, కళాకారులకు పుట్టినిల్లుఅన్నారు. 50 వసంతాలుగా (50 years) మన సంస్క ృతిని పరిరక్షిస్తున్న గొప్ప కళాకారుడు సమస్త నిర్వాహకులు జగన్మోహన్రావు అని ఆయన వ్యాఖ్యానించారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ సాంస్క ృతిక వికాసంతోసమాజ వికాసం కలిగిస్తుందని అన్నారు మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ టి. పెద్దిరాజు మాట్లాడుతూ మానసిక ఆనందంతోపాటు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తూ సామాజిక చైతన్య స్పూర్తిని రగిలించినటువంటి రామకృష్ణ నాట్యమండలి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతూ జగన్మోహన్ రావు గారికి శతదా సర్వదా కృతజ్ఞతలు తెలిపారు ప్రముఖ న్యాయవాది సాహితీ మిత్రుల సంస్థ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో రామకృష్ణ నాట్యమండలి చేసిన కార్యక్రమాలు అభినందనీయమని మచిలీపట్నంలో పుట్టిన సంస్థ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొంగటం అభినందనీయమని అన్నారు. అంకితమైందని చెప్పారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ ధన్వంతరి ఆచార్య మాట్లాడుతూ కళలు ఆరోగ్యంతో పాటు సామాజిక చైతన్యాన్ని కలిగిస్తాయన్నారు. నాట్యమండలి నిర్వాహకులు జొన్నలగడ్డ జగన్మోహన్రావు మాట్లాడుతూ నా ఉన్నంతవరకు పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తూనే ఉంటానని, నిర్వహిస్తూనే ఉంటానని నేనే కాదు కుటుంబం మొత్తం కళా సేవకే నా ఊపిరి ఉన్నంతవరకు పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తూనే ఉంటానని, నిర్వహిస్తూనే ఉంటానని అన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలను ఎలా పరిచయం చేయాలి?

యాంకరింగ్ స్క్రిప్ట్ సాధారణంగా హృదయపూర్వక స్వాగతం మరియు ఈవెంట్ యొక్క అవలోకనంతో ప్రారంభమవుతుంది. దీని తరువాత ప్రతి ప్రదర్శన లేదా విభాగం యొక్క పరిచయం, ప్రతి ప్రదర్శన తర్వాత ప్రశంసలు లేదా ప్రశంసలు మరియు ప్రేక్షకులను నిమగ్నం చేయడానికి వారితో సంభాషించడం జరుగుతుంది.

సంస్కృతి అంటే ఏమిటి?

‘సంస్కృతి అనేది ఒక జనాభాలోని వ్యక్తులు ఎక్కువ లేదా తక్కువ వ్యవస్థీకృతంగా, నేర్చుకున్న లేదా సృష్టించిన అనుభవ ఉత్పన్నాలను కలిగి ఉంటుంది, వీటిలో గత తరాల నుండి, సమకాలీనుల నుండి ప్రసారం చేయబడిన లేదా వ్యక్తుల ద్వారా ఏర్పడిన చిత్రాలు లేదా ఎన్‌కోడ్‌లు మరియు వాటి వివరణలు (అర్థాలు) ఉంటాయి.’

సంస్కృతిని మొదట నిర్వచించింది ఎవరు?

సంస్కృతి యొక్క క్లాసిక్ నిర్వచనం అని పిలువబడేది 19వ శతాబ్దపు ఆంగ్ల మానవ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ బర్నెట్ టైలర్ తన ప్రిమిటివ్ కల్చర్ (1871) యొక్క మొదటి పేరాలో అందించబడింది:

Read hindi news: hindi.vaartha.com

Read also: AP Free bus: మహిళలకు ఆర్టీసి ఉచిత బస్సు పథకంలో జీరో ఫేర్ టిక్కెట్: సిఎం చంద్రబాబు

Breaking News Cultural Programs Jagannatha Rao latest news Machilipatnam Ramakrishna Natya Mandali Telugu News Telugu Theatre

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.