📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Telugu News: Crime: భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

Author Icon By Sushmitha
Updated: December 15, 2025 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనుమానం పెనుభూతమన్నారు పెద్దలు. ఒక్కసారి ఆ ఆలోచన వచ్చిందా అది ఇంతింతై మహావృక్షంగా పెరిగిపోతుంది. అనుమానం ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది. అనుబంధాలను కాలరాసింది. అందుకే అనుమానం రాకూడదు. ఆ భావన కలగకుండా జాగ్రత్తపడాలి. కాని కొందరికి ఎలాంటి ఆధారాలు లేకుండానే మానసిక రుగ్మతకు గురై అనుమానిస్తుంటారు. ఇలాంటివారు ఎలాంటి ఘోరమైన పనులు చేసేందుకైనా వెనుకాడరు. ఓ భర్త అదే పని చేశాడు. అనుమానంతో కట్టుకున్న భార్యను హతమార్చాడు. (Crime) దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

Read Also: Tirumala: ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

Crime Wife’s suspicion raised.. To the police station with the body..

ప్రేమించి, పెళ్లాడారు..

పల్నాడు జిల్లా (Palnadu district) రొంపిచర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి (28)ని బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏట్చూరుకు చెందిన అల్లడి వెంకటేశ్వర్లు ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వెంకటేష్ బేకరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల వెంకటేశ్వర్లుకు తన భార్య మహాలక్ష్మిపై అనుమానాన్ని పెంచుకున్నాడు. దీంతో వీరిమధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవల వల్ల మహాలక్ష్మి రెండునెలలుగా భర్తకు దూరంగా మాచవరంలోని పుట్టింట్లో ఉంటోంది.

మాట్లాడాలని నమ్మించి హత్య చేసిన భర్త ఆదివారం ఉదయాన్నే వెంకటేశ్వర్లు మాచవరంకు వచ్చాడు. పాపకు తెచ్చానని, ఇంటికి వెళదామని నమ్మబలికి, ఆమెను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని, మార్గమధ్యలో ఆమెను హతమార్చాడు. మహాలక్ష్మి ధరించిన స్వెట్టర్ కు ఉన్న తాడును ఆమె గొంతుకు బిగించి, చంపాడు. అనంతరం మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై పెట్టుకుని, పోలీసుస్టేషన్ కు తీసుకొచ్చాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. దీంతో ఖంగుతిన్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bringing dead body to police station Crime news India. Crime of suspicion Domestic violence murder Fatal suspicion Google News in Telugu Husband kills wife out of doubt Latest News in Telugu Marital dispute homicide police investigation Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.