పిల్లలు అడిగింది కొనివ్వకపోతే మారం చేస్తారు. ఏడుస్తారు. తిండితినకుండా మొండిపట్టు పట్టి, వారికి కావాల్సింది పొందుతారు. ఇవి పిల్లచేష్టలు అంటాం. మరి పెద్దవారై, తల్లిదండ్రుల బాగోగులు చూడాల్సిన పిల్లలు తమ కోరికలను తీర్చుకునేందుకు అప్పులు చేయించి, తల్లిదండ్రులను బాధించే బిడ్డలు ఎంతమంది లేరు? తాజాగా ఓ కుమారుడు మొండిపట్టుదలతో (Crime) అప్పుతో బైక్ కొన్నాడు. కానీ అంతలోనే ఊహించని పరిణామం(Crime) జరిగింది.
Read Also: World Skill: వరల్డ్ స్కిల్ కాంపిటీషన్లలో యువత పాల్గొనాలి
డివైడర్ ను ఢీకొట్టిన హరీష్
విశాఖపట్నం(Visakhapatnam) మహారాణిపేటలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు కుమారుడు హరీష్ (19) ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఇటీవల బైక్ కావాలని తల్లిదండ్రులను అడిగితే వారు డబ్బుల్లేవని చెప్పారు. అయినా హరీష్ వినకుండా మొండిపట్టు పట్టడంతో చివరికి తల్లిదండ్రులు దసరా రోజున రూ.3 లక్షలు అప్పు చేసి బైక్ ను కొనిచ్చారు. అయితే హరీష్ టిఫిన్ చేసేందుకు ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు స్నేహితుడు వినయ్ తో కలిసి కొత్తబైక్ పై వెళ్లారు. టిఫిన్ చేసిన తర్వాత స్నేహితుడిని ఇంటివద్ద దించేందుకు కాంప్లెక్స్ నుంచి మితిమీరిన వేగంతో సిరిపురం దత్ ఐలాండ్ మలుపువద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టాడు. దీంతో హరీష్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హరీష్ మృతి చెందాడు. స్వల్ప గాయాలతో హరీష్ స్నేహితుడు వినయ్ బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తమ బిడ్డ కోరికను తీర్చేందుకు రూ.3లక్షలు అప్పు చేసి, బైక్ కొనిస్తే తమకు కడుపుకోత మిగిల్చాడని తల్లిదండ్రులు వాపోతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
EPaper: https://epaper.vaartha.com/
Read Also: