Crime విద్యార్థులకు విద్యాబుద్ధుల్ని నేర్పించాల్సిన టీచర్ తన వక్రబుద్ధిని చూపిస్తే వాటి పర్యవసానం చవిచూడాల్సి వస్తుంది. గురువు దేవుడితో సమానమంటారు. విద్యార్థుల ఉజ్వల భవితకు బాటలు వేస్తారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తనవంతు చేయూతనిచ్చే ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి ఉన్నతస్థాయిలో ఉండే ఉపాధ్యాయులు తన నీచబుద్ధిని చూపిస్తే అలాంటి వారిని ఏం చేయాలి?
Read Also: AP: ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రక్షాళనకు కమిటీ :సత్యకుమార్ యాదవ్

దేహశుద్ధి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
ప్రకాశం జిల్లా (Prakasam District) నాగులప్పలపాడు మండలం హెచ్. నిడమానూరు జెడ్పీహెచ్ ఎస్ తెలుగు ఉపాధ్యాయుడు బక్క ముంతల వినయ్ గత కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు స్కూలుకు వచ్చి ముంతల వినయ్ ను పట్టుకుని చితకబాదారు. దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: