ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా : అంబేద్కర్
కోనసీమ జిల్లా, ఆలమూరు మండలం, మడికి శివారులోని చిలకపాడు గ్రామంలో బుధవారం రాత్రి హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా సెలూన్ షాప్ నిర్వహిస్తున్న పావులూరి కామరాజు అలియాస్ చంటి (36) తన ఇద్దరు చిన్నారులను విషం తాగించి, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చంటి భార్య నాగదేవి ఐదేళ్ల క్రితం ఆత్మహత్య (Crime) చేసుకుంది. ఆ ఘటనపై అప్పటినుంచి కోర్టులో కేసు నడుస్తుండగా, ఇటీవలే రాజీ కుదిరిందని తెలుస్తోంది.
Read also: చికిత్స పేరుతో భార్యని హత్య చేసిన భర్త
తండ్రి చేతిలో ఇద్దరు చిన్నారుల మరణం
ఈ నేపథ్యంలో ఏమైందో తెలియదు కానీ, బుధవారం రాత్రి (Crime) అయిదవ తరగతి చదువుతున్న కుమారుడు అభిరామ్ (11), ఒకటవ తరగతి చదువుతున్న త్రినాథ్ గౌతమ్ (8)లకు పురుగుమందు తాగించి, అనంతరం ఫ్యాన్కు ఉరివేసుకుని చంటి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి చంటి ఓ వీడియో రికార్డు చేసినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే రావులపాలెం రూరల్ సిఐ సి.హెచ్. విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి.నరేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: