📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News:Crime : తిరుపతి దగ్గర భయానక దృశ్యం – ముగ్గురు అనుమానాస్పద మృతి

Author Icon By Pooja
Updated: December 2, 2025 • 10:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి గ్రామీణంలోని తిరుచానూరు సమీప దామినేడు ఇందిరమ్మ గృహాల్లో సోమవారం చోటుచేసుకున్న ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి (Crime)గురి చేసింది. ఒక ఇంటి నుండి వస్తున్న దుర్వాసనను గుర్తించిన నివాసితులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్, ఎస్సై అరుణ తలుపులు తెరవగా, కుళ్లిన స్థితిలో మూడు మృతదేహాలు కనిపించాయి.

Read Also: Cyber ​​crime: డిజిటల్ అరెస్ట్ తో 48 లక్షలు దోచుకున్న ముగ్గురు అరెస్ట్

Crime: Horrific scene near Tirupati – Three suspicious deaths

వివాహేతర సంబంధం… కలిసి జీవనం

తమిళనాడులోని(Crime) గుడియాత్తం ప్రాంతానికి చెందిన సత్యరాజ్ (30) తన భార్యను విడిచి, పొన్నాగుట్టె నాయగి (పొంగొటై) (30)తో సంబంధం పెట్టుకొని మూడు నెలల క్రితం దామినేడు ఇందిరమ్మ ఇళ్లకు వచ్చి నివాసముంటున్నాడు. పొంగొటైతో పాటు ఆమె మూడేళ్ల కుమారుడు మనీష్ కూడా సత్యరాజ్‌తో కలిసి అక్కడే ఉంటున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

అనుమానాస్పద మరణాలు

ఈ నెల 22వ తేదీ ఉదయం నుంచి ఈ ముగ్గురు బయట కనిపించకపోవడంతో అనుమానం మొదలైంది. ఇంటిని తెరిచి చూసిన పోలీసులు సత్యరాజ్‌ను ఉరితీయబడ్డ స్థితిలో, పొంగొటై మరియు చిన్నారి మనీష్‌ను వాష్‌రూమ్ దగ్గర మృతులుగా కనుగొన్నారు. వారి వద్దే విషం సీసా ఉండడం గమనించారు.

ముందుగా పొంగొటై, ఆమె కుమారుడు విషం సేవించి మృతిచెందిన తరువాత సత్యరాజ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక సత్యరాజ్ వారిని హత్య చేసి తానే ఉరివేసుకున్నాడా? అనే రెండు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో దామినేడు ఇందిరమ్మ కాలనీలో ఒక్కసారిగా కలకలం రేగింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

crime-news Google News in Telugu Latest News in Telugu suspicious-deaths Tiruchanur tirupati

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.