📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Crime: శ్రీకాకుళంలో ఘోరం .. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన చేసి భార్య

Author Icon By Anusha
Updated: August 15, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) పాతపట్నం మండలంలో ఒక అతి భయంకరమైన హత్య ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా భార్య తన భర్తను హతమార్చిన కేసు స్థానికులను షాక్‌కి గురిచేసింది.టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం..నల్లి రాజు (34)కు ఎనిమిదేళ్ల క్రితం మౌనిక అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే ఇటీవల మౌనికకు ఊరికి చెందిన గుండు ఉదయ్ కుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం మౌనిక భర్తకు తెలిసి మౌనికను మందలించాడు,అయితే మౌనికలో మార్పురాకపోగా ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించాలని ప్లాన్‌ వేసింది. ఉదయ్‌కుమార్‌ (Uday Kumar) కూడా తన భార్యకు విడాకులిచ్చి ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఉదయ్‌ కుమార్‌ ఆడవేషం ధరించి రాజును రాత్రి వేళ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లడానికి వాట్సప్‌లో మెసేజ్‌లు పంపించాడు. రాజు తిరస్కరించడంతో ఈ ప్రయత్నం విఫలమైంది. రాజు మత్తులో ఉండగా ఇంట్లోనే చంపాలని మరో కుట్ర పన్నారు. అనంతరం ఇంట్లోనే రెండు రోజుల పాటు మౌనిక భర్త రాజుకు ఆహారంలో నిద్ర మాత్రలు కలిపింది.

Crime

స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు

ఆగస్టు 5వ తేదీన అర్ధరాత్రి రాజు నిద్రపోయిన తర్వాత ఉదయ్‌తోపాటు మల్లిఖార్జున్‌ అనే మరో వ్యక్తికి ఫోన్‌ చేసి పిలిపించింది. నిద్రలో ఉన్న రాజు కాళ్లను మౌనిక, మల్లిఖార్జున్ కదలకుండా గట్టిగా పట్టుకోగా, ఉదయ్ అతని ముఖంపై దిండుతో అదిమి ఊపిరిఆడకుండా చేసి హత్య చేశారు.ఆ తర్వాత రాజు బైక్‌ను స్థానిక ఎస్సీ కాలనీలో ఉంచారు. ఉదయ్, మల్లికార్జున్‌లు మరో బైక్‌పై రాజు మృతదేహాన్ని తీసుకొచ్చి రాజు బైక్‌ ఉంచిన ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. ఈ తర్వాత భర్త కనిపించడంలేదంటూ మోనిక కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి నాటకం మొదలెట్టింది. ఆగస్టు 7న ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసుపెట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు గుట్టురట్టైంది. దీంతో ఉదయ్‌కుమార్, మల్లికార్జున్‌తోపాటు మోనికను అరెస్ట్ చేసి తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం అంగీకరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/nalgonda-court-rape-of-minor-girl-in-nalgonda-accused-gets-death-sentence/telangana/530269/

Breaking News Extramarital affair latest news Mallikarjun Mounika Murder case Nalli Raju Patapatnam Pre-planned murder Srikakulam Telugu News Uday Kumar wife kills husband

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.