News Telugu: Crime: కాళ్లు నొక్కించుకున్న టీచర్ పై విద్యాశాఖ సీరియస్

Read Time:  1 min
News Telugu: Crime: కాళ్లు నొక్కించుకున్న టీచర్ పై విద్యాశాఖ సీరియస్
FONT SIZE
GET APP

Crime: పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన పంతులమ్మ వారిచేత చాకిరీ చేయించుకుంది. తాను ఏం చేసినా అడిగేవారు లేరని విర్రవీగిన టీచర్ కు తగిన శాస్తి జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా (srikakulam disrict) మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. ఉపాధ్యాయురాలు సెల్ ఫోన్ లో మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. విద్యార్థులపై జులుం ప్రదర్శించిన టీచర్ బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ దర్జాగా కుర్చీలో కూర్చొని సెల్ఫోన్ లో మాట్లాడుతూ టైమ్ పాస్ చేసింది.

Read aslo: Haryana: నడిరోడ్డుపై యువతిపై కాల్పులకు తెగబడ్డ దుండగుడు

Crime: కాళ్లు నొక్కించుకున్న టీచర్ పై విద్యాశాఖ సీరియస్

Crime: ఏకంగా పిల్లలతో కాళ్లు నొక్కించుకుంటూ విద్యార్థులపై తన జూలూం ప్రదర్శించింది. అందుకు సంబంధించిన మొత్తం తతంగాన్ని అక్కడే ఉన్న ఒకరు వీడియా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. టీచర్ సుజాత చిన్నారులతో చాకిరీ చేయించుకుంది. బందపల్లి బాలిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు ఆదేశించారు. టీచర్ సుజాతకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.