మొగల్తూరు : మొగల్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇన్చార్జ్ సబ్ రిజిస్టర్ గా విధులు నిర్వహిస్తున్న సబ్బితీ శ్రీనివాసు ఢిల్లీ ఎసిబి అధికారులు ముసుగులో మోసపోయారు. రాష్ట్రంలో ఇటీవల ఎసిబి ఏకకాలంలో 12 కార్యాలయాలలో ఇటీవల సోదాలు జరిపి కేసులు నమోదు చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని సైబర్ (cyber crime) నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎసిబి అధికారులమని మీ ఆఫీసు నందు మెరుపు దాడి చేయకుండా ఉండాలంటే, రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read also: MD Manoj Gaurnu: ఎస్ఎల్బిసి టన్నెల్ నిర్మాణ సంస్థ
Crime: ఎసిబి పేరుతో సైబర్ నేరగాళ్ల ఫోన్లు..
ఫోన్ పే ద్వారా రూ.2 లక్షలు పంపారు
దీంతో ఆందోళనా చెందిన సబ్ రిజిస్టర్ శ్రీనివాస్, ఎసిబి అధికారులు అంటూ చెప్పిన సైబర్ నేరగాళ్ల ఫోన్ నెంబర్కు, ఫోన్ పే ద్వారా రూ.2 లక్షలు పంపారు. అంతటితో ఆగని సైబర్ నేరగాళ్లు మరో లక్ష రూపాయలు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన శ్రీనివాస్ ఎసిబి అధికారులను సంప్రదించగా తాము కాదని సమాధానమిచ్చారు. మోసపోయానని తెలుసుకున్న సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ గురువారం మొగల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ నాగలక్ష్మి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: