📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

CRDA : సిఆర్డిఎ భవనం ప్రారంభం

Author Icon By Saritha
Updated: October 14, 2025 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతిలో సిఆర్డిఎ ప్రధాన కార్యాలయ భవన ప్రారంభం

విజయవాడ : రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ అనే కొత్త విధానాన్ని తెచ్చామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు. సమీకరణ విధానాన్ని సక్సెస్ చేసిన చరిత్ర అమరావతి రైతులదేనన్నారు. ప్రపంచంలో ఎక్కడా ల్యాండ్ పూలింగ్ విధానం లేదు.. మనమే ఈ విధానాన్ని తెచ్చాంసక్సెస్ చేశామన్నారు. రాజధాని అమరావతిలో సిఆర్డిఎ (CRDA) ప్రధాన కార్యాలయ భవనాన్ని సిఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. ఇందుకు సంబంధిం చిన శిలా ఫలకాలను ఆవిష్కరించారు. మొదట పూర్ణకుంభం, వేదాశీర్వచనాలతో ఆయనకు వేద పండితులు స్వాగతం పలికారు. భూములిచ్చిన రైతులను సిఎం ఆత్మీయంగా పలకరించారు. భవనాన్ని ప్రారంభించినసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి
(Amaravati) ప్రాంత రైతుల త్యాగాలను ఎప్పటికీ మరువనని అన్నారు. రైతుల అవస్థలు చూశానని, రోడ్డెక్కి ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అమరావతిలో సిఆర్డిఎ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సిఎం మాట్లాడారు. అమరావతి పనుల రీస్టార్ట్ తర్వాత మొదటిగా సిఆర్డిఎ బిల్డింగ్ ప్రారంభమైందన్నారు.ఇది నాకు సంతోషంగా ఉందన్నారు. అమరావతి మహిళా రైతులు రోడ్డెక్కి పోరాడారు. అనేక ఉద్యమాలు చేశారన్నారు.

Read also: ఎప్ సెట్ మొదటి ఫేజ్ కౌన్సెలింగ్ 10,012 సీట్ల కేటాయింపు

రాజధాని రైతుల త్యాగాలను ఎప్పటికీ మరువను: సీఎం

రైతుల ఉద్యమానికి మద్దతుగా నేను కూడా జోలె పట్టాను… ఉద్యమానికి అండగా
నిలిచానన్నారు. వారు పడిన కష్టాలు మరిచిపోవద్దు. మీరు చేసిన త్యాగాల ఫలితాలను మీరే అనుభవిం చాలన్నారు. నేను దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఫేజ్1లో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చారు. భూములిచ్చినందుకు గత పాలకులు మిమ్మల్ని నానా హింసలు పెట్టారు. రాజధాని ఎడారి అన్నారు. వేశ్యల రాజధాని అన్నారు ఎంతో అపహాస్యం చేశారు. మీకు రెట్టింపు గౌరవం దక్కేలా… రెట్టింపు ఫలాలు అనుభవించేలా మేము చేస్తాం. హైటెక్ సిటీ నిర్మాణం మొదలు పెట్టే నాటికి అక్కడ ఎకరం రూ. లక్ష ఉండేది ఇప్పుడు రూ.177 కోట్లకు చేరింది. అమరావతి ప్రాజెక్టు సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో నిర్మిస్తున్నాం…. విమర్శలు చేసే వారంతా ఈ విషయాన్ని గమనించాలన్నారు. అమరావతి(CRDA) ఓ మునిసిపాలిటీగా మిగిలిపోకూడ దంటే అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు అవసరమన్నారు. అమరావతి పరిపాలనకు కేంద్ర బిందువుగా కుంటే అనుకున్న లక్ష్యాలుసాధిస్తారు. అమరావతి అభివృద్ధికి ఆటంకాలు లేవన్నారు. అమరావతిని క్వాంటంవ్యాలీ చేస్తున్నాం. అమరావతి రైతుల అభివృద్ధికి అండగా ఉంటాం. ఒకసారి జరిగిన తప్పుకు రైతులు, నేను, రాష్ట్రం ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసు. మళ్లీ అలాంటి తప్పులు జరగకూడదు. కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలి. పవన్ కల్యాణ్, బిజెపిలతో కలిసి ముందుకెళ్తున్నాం మీరంతా సహకరించాలి అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Amaravati CRDA Amaravati Development Andhra Pradesh politics AP Government Chandrababu Naidu CRDA building inauguration

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.