📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

CPM : ప్రజా ఉద్యమాలే వెన్నుదన్ను – సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

Author Icon By Shravan
Updated: August 5, 2025 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : సామాజిక జీవనంలో సమస్యలను స్వయంగా అనుభవించినవారు, వాటిని నిర్మూలించే దిశలో చెక్కుచెదరని పోరు సాగిస్తారని సిపిఎం (CPM) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ప్రజా ఉద్యమాల్లో ముందుండి ప్రజల కోసం అలసట లేకుండా పోరాడిన యోధుడు విఎస్ అచ్యుతా నందన్ ప్రజల మనిషి అని అన్నారు.. సిపిఎం అగ్రనేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ సంస్మరణ సభ సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో గత రాత్రి పొద్దుపోయే వరకు జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస రావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రాఘవులు మాట్లాడారు. అచ్యుతానందన్ 99 ఏళ్లపాటు కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా, క్రీయాశీలకంగా, ఉద్యమకారునిగా, పోరాట యోధుడిగా జీవించారని తెలిపారు. పట్టుదల, క్రమశిక్షణతో ప్రజలను అంటిపెట్టుకొని ఉన్నారని చెప్పారు. చిన్న అవకాశం దొరికినా, శక్తి కొంచెమే ఉన్నా ప్రజల కోసం పోరాటం చేశారని తెలిపారు. వర్గదృక్పథాన్ని ఆయన ఎప్పుడూ వదిలిపెట్ట లేదని, కష్టజీవుల పక్షాన నిలబడ్డారని
చెప్పారు. పోరాట ఆయన యోధత్వం జీవితంలో మిళితమైం దన్నారు.

కేరళలోనే అసాధా రమైన అభిమానం చూం గొన్న వ్యక్తి అని కొనియాడారు. ప్రజల మనస్సు, హృదయాల్లో గాఢంగా నాటుకు పోయారని చెప్పారు. పరిపాలన సంస్కరణల కమిషన్కు చైర్మన్ గా పనిచేసిన ఆయన ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని అరికట్టేందుకు అనేక ప్రతిపాదనలు చేశారని వివరించారు. నమ్మిన సిద్ధాంతాన్ని, అనుకున్న విషయాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదన్నారు. ప్రతి అంశాన్ని ప్రజల ముందే ఉంచి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు వారిని అందులో భాగస్వాములను చేశారని వివ రించారు.

దేశంలో జాతీయోద్యమం వల్ల అభ్యుదయ, సెక్యులర్, ప్రజాస్వామిక, సమానత్వ భావాలు ప్రజల్లో నాటుకు పోయాయని తెలిపారు. కానీ 1990 తరువాత ఈ భావాలకు చిల్లుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. మతతత్వం, నిరంకుశత్వ భావాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తన పెత్తనం కోసం రాష్ట్రాలకు హక్కులు లేకుండా చేసేందుకు ఫెడరిలిజానికి తూట్లు పొడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ వైఖరి చూస్తుంటే బ్రిటీష్ వాళ్లు దేశంలోకి మళ్లీ వస్తున్నారా అనే పరిస్థితి నెలకొందన్నారు. బీహార్ 65 లక్షల ఓటర్లను తీసేశారని, ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. విఎస్ లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్లు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం అని ఆకాంక్షించారు. ఆయన చూపిన పోరాటం, తెగువ, త్యాగం, స్ఫూర్తి ఒరవడిని రాజీలేకుండా ఉద్యమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/tumburutheertham-permission-to-perform-holy-dips-in-tumburutheertham-soon-similar-to-the-purification-of-sins/andhra-pradesh/526168/

BV Raghavalu CPM Politics People’s Struggles Public Movements Telugu News Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.