📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు

CPI: ట్రంప్‌ను ప్రపంచ బహిష్కరణ చేయాలి

Author Icon By Aanusha
Updated: January 13, 2026 • 9:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెనుజువెలాపై అమెరికా దాడి దుర్మార్గం

అమెరికా యుద్ధ చర్యలను భారత ప్రధాని ఖండించాలి

సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె.నారాయణ డిమాండ్

తిరుపతి బైరాగిపట్టెడలో ట్రంప్ దిష్టిబొమ్మ దహనం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రపంచ బహిష్కరణ చేయాలని సీపీఐ (CPI) జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె.నారాయణ డిమాండ్ చేశారు. ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా మంగళవారం తిరుపతి బైరాగిపట్టెడ కూడలిలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ (CPI)జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె.నారాయణ ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేసి, అమెరికా తీరును ఖండిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

Read also: Basmati Rice: భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

ఈ సందర్భంగా కె.నారాయణ మాట్లాడుతూ, ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ప్రపంచాన్నే ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉందని మండిపడ్డారు. ప్రజాభీష్టం మేరకు ఎన్నికైన ఒక దేశాధ్యక్షుడిని, అతని భార్యను రాత్రికి రాత్రే కిడ్నాప్ చేసినట్టు వ్యవహరించడం మానవహేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే వెనుజులాపై అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడటం వెనుక కార్పొరేట్ కంపెనీల స్వార్థం దాగి ఉందని ఆరోపించారు. ఇది కేవలం సంపాదనపై పిపాసే తప్ప ప్రజాస్వామ్యానికి సంబంధించినది కాదని స్పష్టం చేశారు.

CPI: Trump should be ostracized globally

డిమాండ్

ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికే అమెరికాలోని క్యాపిటల్, న్యూయార్క్ నగరాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ప్రజల నిర్ణయాలతో గెలిచిన నాయకుడి ప్రవర్తనపై అదే ప్రజలు తిరగబడే పరిస్థితి రావడం ట్రంప్ పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య భారతదేశ ప్రధాని ఇలాంటి యుద్ధోన్మాద చర్యలను ఇప్పటికైనా ఖండించాలని కె.నారాయణ డిమాండ్ చేశారు.

ట్రంప్ అంటే భయంతో మౌనం పాటించడం తగదని, ప్రపంచ దేశాలన్నీ కలసి ట్రంప్ చర్యలను ఖండించి ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, విశ్వనాథ్, ఉదయ్, బండి చలపతి, చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ టి. జనార్దన్, ప్రజాసంఘాల నాయకులు శివ, రామకృష్ణ, కాలయ్య, రామచంద్రయ్య, విజయ, నాగరాజు, శ్రీరాములు, లాజర్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

CPI agitation K Narayana CPI latest news Telugu News Tirupati Bairagipatteda Trump protest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.