విలువలతో నిండిన విద్యే దేశాన్ని ముందుకు నడిపించగలదని భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు.శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan), 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్-1 స్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధిలో నేటి పట్టభద్రులు కీలక భాగస్వాములు కానున్నారని ఆయన అన్నారు.
Read Also: AP: రైతుల కోసం కొత్త క్లస్టర్ల ఏర్పాటు
శ్రీ సత్యసాయి జయంత్యుత్సవాల్లో గత మూడు రోజులుగా దేశంలోని అత్యున్నత స్థాయి ప్రముఖులు పాల్గొనడం, బాబా ఎంతటి శక్తిమంతులో తెలియజేస్తోందన్నారు.”శ్రీ సత్యసాయి విద్యాసంస్థల్లో కనిపించే క్రమశిక్షణ, నిబద్ధత మరే యూనివర్శిటీలోనూ కనిపించవు. స్నాతకోత్సవంలో విద్యార్థులందరూ ఎంతో క్రమశిక్షణతో నేలపై కూర్చోవడం నన్ను ఆశ్చర్యపరిచింది.
ఇంత పెద్ద ఎత్తున ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడం గొప్ప విషయం. ఎంతమందిని గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దామనేది కాకుండా, ఎంతమందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దామనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేయడం అభినందనీయం” అని కొనియాడారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ యవనికపై తనదైన ముద్ర వేస్తోందని రాధాకృష్ణన్ (CP Radhakrishnan) అన్నారు.
ప్రధాని మోదీ దేశాన్ని తీర్చిదిద్దారు
“ఒకప్పుడు ప్రపంచం చెప్పేది భారత్ వినేది, కానీ ఇప్పుడు భారత్ చెప్పేది ప్రపంచం వింటోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇన్నోవేషన్లకు కేంద్రంగా, సుస్థిరాభివృద్ధికి ప్రతిరూపంగా ప్రధాని మోదీ దేశాన్ని తీర్చిదిద్దారని తెలిపారు. కోవిడ్ టీకాలను మన దేశం కనుగొనడమే కాకుండా, 100కు పైగా దేశాలకు ఉచితంగా అందించిందని గుర్తుచేశారు.
ఈ సహాయానికి కృతజ్ఞతగా ఒక దేశాధ్యక్షుడు ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించిన సంఘటనను ఆయన ఉదహరించారు. భారతమాత శక్తిమంతమైనదే కాదు, దయ కలిగినదని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. కోవిడ్ టీకాలను వ్యాపారంగా చూడకుండా మానవతా దృక్పథంతో అందించడం వల్లే మోదీ గ్లోబల్ లీడర్‌గా ఎదిగారని స్పష్టం చేశారు.
డ్రగ్స్ అతిపెద్ద సవాలు
పట్టాలు అందుకున్న విద్యార్థులే భవిష్యత్ లీడర్లని ఉప రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి లోకేశ్ రాజకీయాల్లోకి రావాలని సూచించినప్పుడు విద్యార్థుల నుంచి వచ్చిన స్పందన చూస్తే, వారిలో నాయకత్వ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. సత్యసాయి బాబా సూత్రాలను, సిద్ధాంతాలను దేశ విదేశాలకు తీసుకెళ్లాల్సిన బ్రాండ్ అంబాసిడర్లు విద్యార్థులేనని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం సమాజానికి డ్రగ్స్ అతిపెద్ద సవాలుగా మారిందని, ‘నో టూ డ్రగ్స్’ అంటూ యువత పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని కోరారు. మంచి ఫలితాలు సాధించాలంటే పరిశోధన (రీసెర్చ్) రంగానికి మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: