📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

COVID: గుంటూరులో పెరుగుతున్న కరోనా కేసులు ప్రత్యేక ఓపీ ఏర్పాటు

Author Icon By Sharanya
Updated: June 3, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కరోనా మళ్లీ గుంటూరు (Guntur) జిల్లాలో తన పంజా విసురుతోంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు దాదాపుగా తగ్గిపోయిన నేపథ్యంలో, తాజాగా గుంటూరు నగర పరిధిలో పాజిటివ్ కేసులు నమోదవడమంతో ప్రజల్లో ఆందోళన చెలరేగింది. ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి అధికారికంగా వెల్లడించారు. ఇప్పటి వరకూ తెనాలి, ఉండవల్లి వంటి పట్టణాల్లో కేసులు నమోదవుతూ వస్తుండగా, ఇప్పుడు గుంటూరు నగరంలోని జనబాహుల్య ప్రాంతాల్లో కేసులు కనిపించటం గమనార్హం.

కొత్త కేసుల వివరాలు:

సమాచారం ప్రకారం, కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఇద్దరు బాధితులను జీజీహెచ్ ఆసుపత్రికి తరలించి, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.

వైద్య సదుపాయాలు మెరుగుపరిచిన జీజీహెచ్:

కొవిడ్ (COVID) వ్యాప్తి అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, కొవిడ్ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు జీజీహెచ్ క్యాజువాలిటీ విభాగం సమీపంలో ప్రత్యేకంగా అవుట్ పేషెంట్ (ఓపీ) విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఓపీ విభాగంలో రోజుకు కనీసం వంద మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఆరోగ్యశాఖ చర్యలు:

పరిస్థితిని నియంత్రించేందుకు జిల్లా వైద్య శాఖ అధికారులు కరోనా సోకిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జీజీహెచ్‌లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును కూడా సిద్ధం చేశారు. బీ క్లాస్ వార్డులో 15 పడకలతో ఈ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశామని, ఇందులో వెంటిలేటర్లతో పాటు నిరంతర ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచామని డాక్టర్ విజయలక్ష్మి వివరించారు. ప్రజలు కొవిడ్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

Read also: Anagani Satya Prasad: మీ తప్పులను సరిదిద్దుకోండి : మంత్రి అనగాని

#AndhraPradeshHealth #CoronaCases #COVID19 #CovidCare #Guntur #GunturCovidUpdate #SpecialOPD #StaySafe Breaking News in Telugu google news telugu India News in Telugu Latest Telugu News Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.