📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Corruption : లంచం కేసులో వైద్యాధికారి పెన్షన్, గ్రాట్యుటీ నిలిపివేత : మంత్రి సత్యకుమార్ ఆదేశం

Author Icon By Shravan
Updated: August 19, 2025 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Corruption : గతంలో కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి (DMHO) గా పనిచేస్తూ రూ.30,000 లంచానికి ఆశపడిన ఒక డాక్టరుకు నేడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. 2017లో ఆ అధికారి ఒక ప్రైవేట్ ఆసుపత్రి మరియు స్కానింగ్ సెంటర్ సేవల కొనసాగింపునకు( రెన్యువల్) లంచం అడిగినట్లు సమాచారం అందడంతో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ విషయంలో ఎసిబి 2019లో నమోదు చేసిన కేసుపై విచారణ చేపట్టిన కర్నూలు ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం గత నెల ఇచ్చిన తీర్పులో సదరు వైద్యాధికారిలంచం తీసుకున్నట్లు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2020లో పదవీ విరమణ చేసిన సదరు అధికారికి నియమాల ప్రకారం పింఛను మరియు గ్రాట్యుటీ చెల్లింపులను తక్షణమే నిలిపివేయాలని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారంనాడు ఆదేశాలిచ్చారు. ముడుపుల ఆరోపణలో న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటున్న ఆ అధికారి 2020లో పదవీ విరమణ చేశారు.

లంచం కేసులో కర్నూలు డీఎంహెచ్‌కు పెన్షన్, గ్రాట్యుటీ రద్దు

నియమాల ప్రకారం ఆ అధికారికి పింఛను మొత్తంలో 75 శాతాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. వైద్యారోగ్య శాఖామంత్రి (Minister of Health) నేటి ఆదేశాలతో ఈ నెల నుంచి పెన్షన్ చెల్లింపును నిలిపివేస్తారు. ఆంధ్రప్రదేశ్ సవరించిన పెన్షన్ నిబంధనలు, 1980 ప్రకారం ముడుపుల కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయిన వారికి పింఛను, గ్రాట్యుటీ చెల్లింపులు చేయబడవు. 2020లో నమోదైన ఈ కేసులో సదరు కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారిని గత నెలలో దోషిగా నిర్ధారించి ఒక ఏడాది పాటు కఠిన కారాగార శిక్షను, రూ.10,000 జరిమానాను కర్నూలు ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం విధించింది. ప్రస్తుత నియమాల ప్రకారం 62 ఏళ్లకు పదవీ విరమణ చేసిన డిఎంహెచలకు జీవితకాలం నెలకు సుమారు రూ.1,00,000కు పైగా పెన్షన్ పొందే అవకాశముంది. దీంతోపాటు సుమారు రూ.20 లక్షలు గ్రాట్యుటీ అందుతుంది. రూ.30,000 లంచానికి ఆశపడిన సదరు కర్నూలు జిల్లా వైద్యారోగ్య అధికారి ఈ మొత్తాన్ని కోల్పోయే పరిస్థితి ఎర్పడింది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/devotees-brahmotsavam-arrangements/andhra-pradesh/532437/

Anti-Corruption Action Breaking News in Telugu Government Employee Bribery Gratuity Stopped Latest News in Telugu Pension Suspension Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.