ప్రపంచం మొత్తం క్యాన్సర్ వ్యాపించిన ఒక వ్యాధి ఉంది శరీరానికి కాదు, సమాజానికి. రక్తప్రసరణకు కాదు, పరిపాలనకు. దేశాల భవి ష్యత్తును క్షీణింపజేసే ఓ భయంకర జాడ్యం అదే అవినీతి (Corruption). నాగరికతలు అభివృద్ధి చెంది, ప్రజాస్వామ్యాలు బల పడుతున్నాయని మనం చెప్పుకుంటున్నా, ఈదుర్బందానికి ప్రపంచంలో ఇప్పటికీ శాశ్వత ఔషధం దొరకలేదు. దేశం ఎంత అభివృద్ధి చెందినదైనా, ప్రజాస్వామ్యం ఎంత పెద్దదైనా, నిబంధనలు ఎంత కఠిన మైనా ఈ కలుషిత లావా మన వ్యవస్థలను మన కళ్ల ముందే కాల్చేస్తూనే ఉంది. 2003లో ఐక్యరాజ్యసమితి తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాల పాలనలో పారదర్శకత అవసరాన్ని స్పష్టంగా చెబుతోంది. అవినీతి (Corruption)తాకిడికి విప రీతంగా బాధపడుతున్న ప్రపంచ ప్రజలకు ఓ మేల్కొలుపు పిలుపు. డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాలు అధిక పారదర్శకతతో, కఠిన చట్టాలతో అవినీతిని చాలా వరకు అదుపులో పెట్టాయి. మరో వైపు సిరియా, దక్షిణ సూడాన్, సోమాలియా, నార్త్ కొరియా వంటి దేశాలు అవినీతి అగాధంలో పూర్తిగా కూరుకుపోయి ప్రపంచ దృషలో అత్యంత అపఖ్యాతిని మూటగట్టుకున్నాయి.
Read Also : http://Hyderabad Weather: హైదరాబాద్‌లో గజ ..గజ ..

ప్రజాస్వామ్య వ్యవస్థకు దెబ్బ
ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 1995 నుంచి ప్రకటిస్తున్న అవినీతి సూచీలో భారత్ స్థానమే మనకు అత్యంత చేదు నిజాన్ని చెబుతోంది. 180 దేశాల్లో మన దేశం 85వ స్థానంలో మాత్రమే ఉంది. ఇది మన అభివృద్ధి లక్ష్యాలకు పెద్ద అడ్డంకే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకు దెబ్బకు దెబ్బ. అవినీతి భారతదేశంలో నిన్న మొన్నటి సమస్య కాదు. స్వాతంత్ర్యం వచ్చిన రెండేళ్లకే 1948లో జీపుల కుంభకోణం వెలుగుచూసింది. అప్పటి మన హైకమీషనర్ వి.కె.కృష్ణమీనన్, అన్ని ప్రభుత్వ ప్రోటోకాల్స్ ను పక్కనబెట్టి 80 లక్షల రూపాయల విలువైన జీపుల కొను గోలుకు విదేశీ కంపెనీతో అక్రమ ఒప్పందం చేసుకోవడం దేశంలో అవినీతి వ్యవస్థకు తొలి అధ్యాయం అయింది. ఆ రోజు నుంచే మన దేశంలో అవినీతి కేసులు వరదలా వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం మారినా, నాయకులు మారి నా, ఆశలు మారినాకానీ అవినీతి మాత్రం ప్రతి కాలంలో రెక్కలు విప్పి ఆకాశంలో ఎగిరింది. భారతదేశ చట్టాలు, న్యాయ వ్యవస్థ, పరిపాలనలో అనేక లోపాలు ఉండటం వల్ల ఈ అవినీతి రాక్షసానికి మరింత బలం వచ్చింది. ఉన్నతాధికారులకు ఇచ్చిన విసృత విచక్షణాధికారాలు, నిఘా సంస్థల నిద్రలేపకపోవడం, ఫైల్ ప్రాసెసింగ్లో ఉన్న అడ్డం కులు, పారదర్శకత లేకపోవడం, వ్యవస్థలో పాతుకుపోయి న పనితీరు ఇవన్నీ అవినీతికి కారణమయ్యాయి. అది ఒక మొక్కలా పెరిగి చెట్టుగా మారింది.చెట్టుగా మారి అడవిగా వ్యాపించింది. చివరకు న్యాయ వ్యవస్థ ద్వారాల దగ్గరికి కూడా చేరేసుకుంది.
ప్రజాస్వామ్య పతనానికి చిహ్నం
2021లో అత్యధిక అవినీతి ఉన్న రాష్ట్రాల బితాలో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ పేర్లు చేరుకోవడం మనకు ఒక పెద్ద హెచ్చరిక. ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రతినిధులుగా ఎన్నికైన ఎమ్మె ల్యేలూ, ఎంపీలూ కూడా అవినీతి పాలై సమాజాన్ని తప్పు దోవ పట్టించడం దురదృష్టం. ఒకప్పుడు రాజకీయాలను సేవగా భావించేవారు. ఇప్పుడు రాజకీయాలు అత్యంత లాభదాయక వ్యాపారంగా మారిపోయాయి. ఎన్నికల్లో డబ్బు, మద్యం, బహుమతులు పంచడం సాధారణ ప్రక్రియగా మారిపోయింది. 50సంవత్సరాల క్రితం ఓటర్లకు డబ్బులి వ్వాలని ఎవరూ అనలేదు. ఇప్పుడు శాసనసభ ఎన్నికలకు 100 కోట్లు, పార్లమెంటు ఎన్నికలకు 200 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? స్పష్టమే అవినీతి ద్వారానే. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఓటుకు 10,000 రూపాయలు వరకూ ఇవ్వడం సాధారణంగా మారిపోయింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓ పార్టీ గోనెసంచుల్లో నోట్ల కట్టలతో కాలనీల్లో తిరుగుతూ ఇంటింటికి వెయ్యి రూపాయలు పంచిన ఘటన ప్రజాస్వామ్య పతనానికి చిహ్నం. ఇది కేవలం ఓట్ల కొనుగోలుకాదు. ప్రజాస్వామ్య విలువలకే ఖనన. ఇదంతా రాజకీయ నాయ కులకే పరిమితం కాదు. పరిపాలన వ్యవస్థలోని ఉన్నతాధి కారులు, ముఖ్యంగా ఉన్నతస్థానాల్లో ఉన్నవారు, ప్రతిష్టా త్మక పదవులలో ఉన్నవారు కూడా లంచాల్లో మునిగిపోయి న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. 2018-19లో 643 ఫిర్యాదులు, 2019-20లో 753, 2020-21లో 581 ఫిర్యాదులు ఉన్నతాధికారులపై రావడం బాధాకరం. కాని అత్యంత భయంకరమైన పరిస్థితి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగు ల్లో నమోదు అవుతోంది. మొత్తం 1,15,000 మందిపై అవినీతి ఆరోపణలు రావడం దేశ పరిపాలనా దౌర్బల్యానికి స్పష్టమైన ప్రతీక. అందులో ప్రభుత్వ ఉద్యోగులపై మాత్ర మే 11,000కేసులు రావడం ఆశ్చర్యం. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాదు మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, మైనింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్, విద్యుత్, ఆరోగ్య రంగాలు ప్రతి రంగంలోనూ అవినీతి శిరాకేసి కూర్చుంది. 2013లో ఎర్నెస్ట్ యంగ్ సంస్థ ఇచ్చిన నివేదిక దీనికి ధృవీకరణ.

పాలనా వ్యవస్థ పతనానికి సంకేతం
ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే, రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పాలంటే, మాటలు సిగ్గు పడతాయి. రెండు సంవత్సరాల్లో మూడు సార్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరగడం కూడా ఇదే కథ చెబుతోంది. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, రిజిస్ట్రేషన్, ఏ శాఖ చూసినా లంచాల బజారుగా మారిపో యింది. భూముల రిజిస్ట్రేషన్లకు 25,000 నుంచి 60,000 వరకు బహిరంగంగా లంచం తీసుకుంటున్నారంటే సాధారణ మధ్యతరగతి ప్రజలపై పడుతున్న భారాన్ని ఊహించుకోవచ్చు. చిన్నపాటి వివాదాలున్న భూములైతే లక్షల్లో డిమాండ్లు చేస్తున్నారు. అధికారులకు అండగా కొన్ని డాక్యు మెంట్ రైటర్లు, దళారులు, రాజకీయ నాయకులు కలిసి ఒకవ్యవస్థీకృత అక్రమ అండర్వర్డ్ను ఏర్పరుచుకున్నారు. కొంద రు రోజుకు లక్షలు సంపాదిస్తున్నట్లు ఏసీబీ విచారణల్లో బయటపడింది. వెంటనే స్పందించాల్సిన పరిస్థితి ఇది. కానీ అవినీతి అధికారులు దాడులు చేయొద్దని, లేని పక్షంలో ఉద్యోగాలకు రాకుండా సమూహంగా సెలవులు తీసుకుంటా మని ప్రభుత్వానికే బెదిరింపులు పెడుతున్నారు! అవినీతిఇంత బలవంతం అవడం మన పాలనా వ్యవస్థ పతనానికి సంకే తం. హెచ్ఎండీఏ, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల్లో ఆస్తుల అక్రమకేసులు, ట్రాప్లు, ఇవన్నీ చూస్తుంటే తెలంగా ణలో ప్రతినాలుగు రోజులకు ఒక అవినీతి కేసు నమోదవు తోంది. ఇది కేవలం అంకెల సమస్య కాదు. ఇది ప్రజాస్వా మ్యానికి వచ్చిన పగుళ్లు. ఈ అన్ని ఉదాహరణలు మనకు ఒక స్పష్టమైన నిజం చెబుతున్నాయి. చట్టాలు బలహీనంగా ఉంటే, నిఘా సంస్థలు నిద్రపోతే, ప్రజలు మోనంగా ఉంటే అవినీతి పెరుగుతుంది. దీనికి నివారణ ఒకటే సామాజిక మేలుకొలుపు. దేశం మారాలంటే ప్రజల్లో సహనం పెరగాలి. రాజకీయ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పోలీస్ వ్యవస్థలో రాజకీయ జోక్యం పూర్తిగా తగ్గాలి. దర్యాప్తు సంస్థ లకు సంపూర్ణ స్వేచ్ఛవ్వాలి. కఠినశిక్షలు తప్పనిసరి చేయా లి. పారదర్శక పాలన వ్యవస్థలను ప్రతిష్టించాలి. విద్యార్థు లకు బాల్యంనుంచే నీతిపాఠాలు బోధించాలి. లంచం తీసు కున్నవారే కాదు, ఇచ్చిన వారికీ శిక్షలుండాలి. ఎన్నికల సమ యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై పటిష్ట నిఘా ఉంటే ఓట్ల కు డబ్బుపంచడం ఆగిపోతుంది. అధికారులు తమను తాము శుభ్రపరుచుకుంటే వ్యవస్థ మెరుగుపడుతుంది. ప్రజలు నిర సిస్తే పాలకులు వణికిపోతారు. అవినీతి రహిత భారతదేశం ఒక కలగానే మిగిలిపోతుంది అనేది ఒక నగ్న సత్యం. అందుకే మార్పు మన దగ్గర నుంచేప్రారంభం కావాలి.
– మన్నారం నాగరాజు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :