📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్

Latest Telugu News : Cooperative system : సంక్షోభంలో ‘సహకారం’

Author Icon By Sudha
Updated: December 12, 2025 • 3:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అప్పిచ్చువాడు వైద్యుడు, నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్ చొప్పడిన యూర నుండుము, చొప్పడకున్నటి యూరు చొరకుము సుమతీ. అంటూ సుమతీ శతకకారుడు కొత్త ప్రదేశాల్లో స్థిరపడ లేననుకునేవారికి కొన్ని సూచనలు ఇచ్చారు. అందులో మొట్టమొదటిది ముఖ్యమైంది అప్పు.అప్పుకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాడో అర్థమవుతుంది. ఆరోగ్యం, నీరు కంటే అప్పిచ్చువారికే అగ్రతాంబూలం ఇచ్చారు. ఇది కొత్తగా వచ్చిందికాదు, కొత్తగా చెప్పేది కాదు. ఎంతో అను భవంతో కాచి వడబోసిన సుమతీ శతకమిది. పూర్వీకుల నుంచి గ్రామీణ రంగంలో రైతులను ఆదుకునేందుకు అప్పులు అందించే వ్యవస్థ ఏదో ఒక రూపంలో కొనసాగు తూనే ఉండేవి. రాజుల కాలంలో కానీ, ఆ తర్వాత కానీ గ్రామాల్లో అవసరాలను బట్టి రైతులకు రుణసహాయం అందించేవారు. లాభాపేక్ష ఉండేది కాదు. రైతులు అప్పులు ఇచ్చేవారి మధ్య అవినాభావ సంబంధాలు ఉండేవి. ఎంతో మానవతా విలువలు ఉండేవి. ఒకరినొకరు ఆదుకోవాలనే తపన ఉండేది. దిగజారిపోయిన మానవతా విలువలతో పాటు ఆ వ్యవస్థ కూడా కేవలం లాభాపేక్ష ధ్యేయంగా మారి అధిక వడ్డీలు, అపరాధ వడ్డీలుఅంటూ అమాయకులను దోపిడీ చేయడం ఆరంభించింది. రైతుల అవసరాల ను ఆసరాగా తీసుకొని ‘నాగు’లంటూ పంటకాలానికిబస్తా రెట్టింపు వసూలు చేసే విధానం చోటు చేసుకున్నది. ఈ నాగులు, అపరాధ వడ్డీలు చెల్లించలేక ఎన్నోకుటుంబాలు వీధినపడ్డాయి. మరో మాటలో చెప్పాలంటే వెట్టిచాకిరి ఆవిర్భావించింది దీని నుంచే. ఈ దోపిడీని అడ్డగించిన వారు, వ్యతిరేకించిన వారిలో కొందరు యువకులు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచారు. పోరాట బాట పట్టారు. ఒక దశలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఈసమస్య తలనొప్పిగా మారింది. అప్పులభారం భరించలేక వ్యవసాయానికే మంగళం పాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వడ్డీ వ్యాపారులను కట్టడిచేయలేక అటు రైతులను ఆదుకోలేక, ఆనాటి ఆంగ్ల పాలకులు సతమతమయ్యారు. ఎన్నో కమిటీలు సుదీర్ఘ అధ్యయనం అనంతరం గ్రామీణ పరిస్థి తిని అర్థం చేసుకొని బ్రిటిష్ప్ర భుత్వం మొట్టమొదటి సారిగా 1904లో సహకార వ్యవస్థకు (Cooperative system) శ్రీకారం చుట్టారు. 1911 మార్చి17న గుంటూరు లో జిల్లా స్థాయి సహకార బ్యాంకు ఆవిర్భవించింది. ఆ తర్వాత అయ్యదేవర కాళేశ్వర రావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటివారు కలిసి విజయవాడ కో ఆపరేటివ్ బ్యాంకును స్థాపించారు. అందు లో నుంచి విడిపోయిన పట్టాభి సీతారామయ్య భూముల ను తనఖా పెట్టుకొని దీర్ఘకాలిక రుణాలు ఇచ్చేభూతనఖా బ్యాంకులను భారతదేశంలోనే మొదటిసారిగా కృష్ణ జిల్లా గుడ్లవెల్లూరులో 1925 అక్టోబరు 31వ తేదీన శ్రీకారం చుట్టడంతో గ్రామీణరంగంలో రుణవసతులు కల్పించడం లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయనే చెప్పొచ్చు. రైతులందరికీ కాకపోయినా కొందరికి ఈ వ్యవస్థ ఎంతో ఊరట కలిగించడని చెప్పొచ్చు. అప్పట్లోనే కొందరు భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు ఎవరివంతు వారు ఈ వ్యవస్థకు తూట్లు పొడిచే ప్రయత్నాలు చేశారు. అలాంటి ఆటుపోట్లు ఎన్నో తట్టుకొని రైతుల విశ్వాసాన్ని చూరగొంటూ అంచలంచెలుగా ఎదిగి స్వాతంత్ర్యానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 1964లో సహకార చట్టం వచ్చింది. రైతుల కష్టాన్ని వడ్డీ, చక్రవడ్డీరూపంలో దోచుకుంటున్న కొందరు వ్యాపారులకు, పెత్తందారులకు ఇబ్బంది కలిగించినా రైతులకు మాత్రం వరప్రసాదంగా మారింది. మొత్తం మీద సహకార వ్యవస్థ (Cooperative system)లో గ్రామీణ రంగంలో ఈ బాధలు తప్పిపోయాయని రైతులు ఎంత గానో ఆనందించారు. రైతులకు కొత్త ఆశలు రేకెత్తించి అంచలంచెలుగా ఎదిగి లక్షలాది మంది రైతులకు కోట్లాది రూపాయలు అప్పులు ఇచ్చే స్థాయికి ఈ వ్యవస్థ చేరుకు న్నది. మరెన్నో రైతు సంఘాలు ఆవిర్భవించి దేశానికే ఆదర్శంగా నిలిచాయి. కరీంనగర్ జిల్లా ములకనూరులో ఏర్పడిన “సొసైటీ కార్యక్రమాలు చూసేందుకు బ్రిటన్ లాంటి దేశాల నుంచి వచ్చి అధ్యయనం చేసి వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యవస్థలోకి రాజకీయాలు ప్రవేశించడంతో క్షీణదశ ఆరంభమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా గత రెండు, మూడు దశాబ్దాలుగా పరిస్థితి దిగజారి పోతున్నది. సహకార సంఘాల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. కొన్ని సహకార సంఘాలు తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కొందరి ఉద్యోగుల చేతివాటంతో అవినీతి పెరిగిపోవడం అన్నదాతలకు తెలియకుండా వారి పేర్లపై రుణాలు తీసుకొని భోంచేసిన సంఘటనలు చోటుచేసుకు న్నాయి. ఎంతో పవిత్ర ఆశయంతో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ కేవలం రాజకీయ జోక్యంతో పతనం అంచుకు చేరుకుంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సహ కార చట్టంలో ఎన్నిసార్లు మార్పులు, చేర్పులు చేశారో లెక్కలేదు. చివరకు పాలకమండళ్లు లేకుండా తాము నామినేట్ చేసిన వ్యక్తులతో వ్యవస్థను నడిపించేందుకు కూడా పాలకులు వెనుకాడలేదు. రాజకీయ అవసరాలకోసం వారూ, వీరు అని తేడా లేకుండా పది రూపాయలు చెల్లిం చి సభ్యులుగా చేరవచ్చనే సవరణ తీసుకొచ్చారు. మళ్లీ దాన్ని కొంతకాలానికి సవరించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఇష్టానుసారంగా సభ్యత్వాన్ని పెంచారు. ‘ఒకరి కోసంఅందరు, అందరి కోసం ఒకరు నిలిచి’ అన్న సహకార స్ఫూర్తి కి ప్రమాదం వాటిల్లే పరిస్థితులు దాపు రించాయి. ఇప్పటి కైనా పాలకులు వాస్తవాలు గ్రహించాలి. కుప్పకూలుతున్న సహకార వ్యవస్థను కాపాడుకోవాల్సిన తరుణమిది. వాణి జ్య బ్యాంకులు అప్పులు అందిస్తున్నావాటికి తోడు ఎంతో పవిత్ర ఆశయంతో ప్రారంభించిన ఈ సహకార వ్యవస్థ కీలకమనే విషయం పాలకులు విస్మరించరాదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News cooperation crisis cooperative societies cooperative system economic issues latest news rural economy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.