📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Constable Results: కానిస్టేబుళ్ల ఫలితాలు.. తుది రాత పరీక్షకు క్వాలిఫై

Author Icon By Shravan
Updated: August 2, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 6100 కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను (Constable Results) రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయం లో జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఆర్.కె. మీనా, అడిషనల్ డీజీపీ ఎన్. మధుసూదన రెడ్డి పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు. 3580 సివిల్ పోలీస్ కానిస్టేబుల్స్ (స్త్రీ, పురుషులు), 2520 ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ (RESULTS) నియామ కాలకై నిర్వహించిన పరీక్షల్లో విశాఖపట్టణానికి చెందిన గండి నానాజీ 168 మార్కులతో ప్రథమ స్థానంలో, విజయనగరానికి చెందిన జి. రమ్య మాధురి 159 మార్కులతో ద్వితీయ స్థానంలో, రాజమండ్రికి చెందిన మెరుగు అచ్చుతారావు 144.5 మార్కులతో తృతీయ స్థానం సాధించారని హోం మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ మొత్తం 5,03,486 మంది అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగా 4,59, 182 మంది ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరయ్యారన్నారు. వీరిలో 95,208 మంది అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్షలకు అర్హత సాధించారన్నారు. 13
కేంద్రాల్లో నిర్వహించిన శారీరక సామర్థ్య పరీక్షల్లో 95,208 గాను 38,914 మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు క్వాలిఫై అయ్యారన్నారు. 10.07.2025న విడుదలైన తుది రాత పరీక్షా ఫలితాల్లో 33,921 మంది అభ్యర్థులు అర్హత సాధించారన్నారు.

పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరతను అధిగమించడానికి ఈ నియమాక ప్రక్రియ ఎంతగానో దోహదం చేస్తుందని హోం మంత్రి అన్నారు. సెలక్ట్ అయిన 6100 మంది అభ్యర్థులకు సెప్టెంబర్ మొదటివారం నుండి ట్రైనింగ్ మొదలవుతుందని హోం మంత్రి తెలిపారు, పోలీస్ శాఖలో మిగిలిన ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు హెం మంత్రి శ్రీమతి అనిత వెల్లడించారు. 3580 సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు జరిగిన నియామక ప్రక్రియలో 1,063 మంది మహిళలు కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారని తెలి పారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్ సైట్ అందుబాటులో ఉంటుందని, వివిధ క్యాట గిరీలకు సంబంధించిన కటాఫ్ మార్కులు కూడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయన్నారు.

CHECK RESULTS : https://www.tgprb.in/

READ MORE :

https://vaartha.com/mega-dsc-website-accessibility/andhra-pradesh/524599/

anitha AP Police Constable Results 2025 Breaking News in Telugu Latest News in Telugu results Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.