📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

తూర్పు గోదావరి జిల్లాలో జీబీఎస్ కేసుల కలకలం

Author Icon By sumalatha chinthakayala
Updated: February 19, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో జీబీఎస్ కేసుల కలకలం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 2 రెండు కేసు నమోదు అయ్యాయి. వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్ కి తరలించారు. ఇటీవలే విశాఖలో ఓ మహిళా మరణించడంతో ఏపీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జీబీఎస్‌ కేసులు వరుసగా నమోదవుతుండడం కలవరపరుస్తోంది.

అప్రమత్తం కావాలని వైద్యులు సూచన

ముఖ్యంగా జ్వరం, జలుబు, దగ్గు, డయేరియా వంటివి వచ్చి తగ్గిన వారం, పది రోజుల్లో కాళ్లు, చేతులు నీరసంగా ఉండడం,తిమ్మిర్లు ఎక్కడం, గొంతులోకి ముద్ద దిగకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, కాళ్లలో మంటలు వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సేవలు పొందాలని, లేనిపక్షంలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి ప్రాణాలు పోయే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. జీబీఎస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

జీబీఎస్‌ అంటువ్యాధి కాదు..

కాగా, ఈ వ్యాధి సోకడానికి కచ్చితమైన కారణం తెలియదు కానీ.. తరచుగా వైరల్‌ లేదా బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల వస్తుంది. ఇది శరీరంలో వేగంగా అభివృద్ధి చెంది రోగ నిరోధక శక్తిపై దాడిచేస్తుంది. దీనివల్ల శ్వాసకోశ కండరాలు ప్రభావితమైతే.. ఇంటెన్సివ్‌ కేర్‌లో వెంటిలేషన్‌పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. జీబీఎస్‌ అంటువ్యాధి కాదని ప్రజలకు భరోసానిచ్చారు.తూర్పు గోదావరి జిల్లాలో జీబీఎస్ కేసుల కలకలం.

అధికారుల అప్రమత్తత

జీబీఎస్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే కేసులు నమోదైన ప్రాంతాల్లో ఆరోగ్య బృందాలను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

జీబీఎస్‌పై ప్రభుత్వ ప్రతిస్పందన

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ఈ వ్యాధికి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యుల సూచనల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర స్థాయిలో మెడికల్ టెస్టింగ్ ల్యాబ్‌లు మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రజల భయాలను తొలగించే చర్యలు

వైద్య నిపుణుల ప్రకారం, జీబీఎస్ అనేది ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఏర్పడే వ్యాధి. ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించదని, ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. కానీ, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యసేవలు పొందాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జీబీఎస్ కేసులు – మున్ముందు చర్యలు

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాధి అదుపు కోసం కొన్ని కీలక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా జిల్లాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచి, ప్రజలకు సత్వర వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటోంది. ముందుగా అప్రమత్తత కలిగి, ఆరోగ్య నిబంధనలు పాటించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Breaking News in Telugu East Godavari district gbs cases Google news Google News in Telugu Latest News in Telugu Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.